ఈసారి హుస్సేన్ సాగర్లోనే వినాయక నిమజ్జనం, హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: ఈసారి భాగ్యనగరం నడిబొడ్డున గల సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే, వచ్చే ఏడాది ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చూడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం కేసు విచారణను న్యాయస్థానం ఆరు వారాలకు వాయిదా వేసింది.

హైదరాబాదులోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనం ఆపాలని కొద్ది రోజుల క్రితం ఓ పిటిషన్ దాఖలైంది. దీని పైన హైకోర్టు విచారణ చేపట్టింది. ఈసారికి వినాయక విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లోనే నిమజ్జనం చేయవచ్చునని కోర్టు సూచించింది.

వచ్చే ఏడాది ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని అనంతరం కేసును ఆరువారాలకు వాయిదా వేసింది. అలాగే, సాగర్ కాలుష్యం కాకుండా చూసుకోవాలని ఆదేశించింది.

High Court green signal to vinayaka Nimajjanam in Sagar

అంతకుముందు రెండు వారాల క్రితం కూడా ఈ పిటిషన్ పైన న్యాయస్థానం విచారణ జరిపింది. 15 అడుగులలోపు విగ్రహాలను నిమజ్జనం చేస్తే అభ్యంతరం ఏమిటని పిటిషనర్లను హైకోర్టు ప్రశ్నించింది.

దీని వల్ల వచ్చే సమస్యలు ఏమి లేవని హైకోర్టు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను ఈనెల 27కు, ఆ తర్వాత ఈ రోజుకు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ బుధవారం నాడు హిందూ చైతన్య సభ పోస్టర్ విడుదల చేసింది.

High Court green signal to vinayaka Nimajjanam in Sagar

సికింద్రాబాద్‌లో ఆర్టీసీ బస్సు దగ్ధం: ప్రయాణికులు సురక్షితం

ప్రయాణికులతో జీడిమెట్ల నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న జీడిమెట్ల డిపోకు చెందిన ఆర్టీసీ మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సు దగ్ధమైన విషయం తెలిసిందే. ఇంజిన్‌ నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవరు అప్రమత్తమై సికింద్రాబాద్‌ పరేడ్‌ మైదానం సమీపంలో ప్రధాన రహదారిపై బస్సును నిలిపివేశాడు.

వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు బస్సు నుంచి కిందికి దిగారు. ప్రయాణికులు బస్సులోంచి కిందికి దిగిన కొద్ది క్షణాల్లోనే ఇంజిన్‌ నుంచి భారీగా మంటలు చెలరేగాయి. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించటంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పివేశారు. ప్రమాద ఘటనపై ఆర్టీసీ అధికారులు, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+