గౌతమీపుత్ర శాతకర్ణి: బాబు ప్రభుత్వాన్ని తప్పుబట్టిన హైకోర్టు, బంధువు కాబట్టే...
బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది.
హైదరాబాద్: బాలకృష్ణ నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఏపీ ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇవ్వడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ప్రొసీడింగ్స్ లేకుండా జీవో ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ సినిమాకు పన్ను మినహాయింపును ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు విచారించింది.

ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బాలకృష్ణ బంధువు కాబట్టే ఈ సినిమాకు పన్ను మినహాయింపు ఇచ్చారని పిటిషనర్ వాదించారు. పన్ను మినహాయింపుకు సంబంఎధించి జీవో 14ను రద్దు చేస్తామని, మరో రెండు రోజుల్లో కొత్త జివో ఇస్తామని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కేసు తదుపరి విచారణ రేపటికి వాయిదా పడింది.












Click it and Unblock the Notifications