చంచల్‌గూడ జైలులో నాయిని ఇలా (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి సోమవారం నాడు హైదరాబాదులోని చంచల్ గూడ జైలును సందర్శించారు. జైలులో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. కాగా, అంతకుముందు నాయిని నర్సింహా రెడ్డి బుల్లెట్ ప్రూఫ్ కారు సోమవారం మధ్యాహ్నం పంక్చర్ అయింది. కారు పంక్చర్ అయినప్పుడు ఆయన ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్తున్నారు.
వాహనం పంక్చర్ కావడంతో డ్రైవర్ కారును నెమ్మెదిగా రోడ్డు పక్కన ఆపాడు. దీంతో నాయిని ఉప ముఖ్యమంత్రి మహ్మద్ అలీ కారులో వెళ్లారు. అనంతరం ఆసుపత్రి నుండి ప్రయివేటు కారులో ఆయన చంచల్ గూడ జైలు ప్రిజన్ డీజీ కార్యాలయానికి వెళ్లారు.
ఈ సందర్భంగా నాయిని మాట్లాడారు. తాను కూడా జైలు జీవితం గడిపానని, జైలు మనిషినే అని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు.

నాయిని
ఖైదీల్లో ప్రవర్తన మారే విధంగా జైళ్లు ఉండాలన్నారు. జైళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ జైళ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

నాయిని
ఖైదీల్లో పరివర్తన తెచ్చేలా జైళ్లు ఉండాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి సూచించారు. జైళ్లలో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామన్నారు.

నాయిని
జీవితంలో తొందరపడి తప్పు చేసి జైలుకు వచ్చిన వారిలో మార్పు తీసుకురావాలన్నారు. జైళ్లలో ఖైదీలకు వృత్తి నైపుణ్యం పెంచేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

నాయిని
జైళ్లకు ప్రత్యేక బడ్జెట్ ఇప్పిస్తానని హామీనిచ్చారు. దేశంలో కన్నా దక్షిణాదిన తమ రాష్ట్రం ముందుండేలా పని చేయాలని సూచించారు.

నాయిని
తెలంగాణ రాష్ట్రంలోని జైళ్లను అవినీతిరహితంగా మార్చామని జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ తెలిపారు. దేశానికే తెలంగాణ జైళ్లు ఆదర్శంగా నిలిచాయని ఆయన పేర్కొన్నారు.

నాయిని
ఖైదీల సమస్యలు తనకు కూడా తెలుసన్నారు. ఎమర్జెన్సీ కాలంలో 18 నెలలు చంచల్‌గూడ జైలులో జైలు జీవితం గడిపానని గుర్తు చేశారు.

నాయిని
తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా జైలుకు వెళ్లానని తెలిపారు. ముషీరాబాద్ జైలుకు సుమారు 50 నుంచి 60 సార్లు వెళ్లి ఉండొచ్చని పేర్కొన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications