వైరల్ వీడియో: రెండేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడి..
హైదరాబాద్ మహానగరంలో వీధికుక్కల దాడులు తరచూ జరుగుతున్నాయి. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారులపై వీధి కుక్కలు దాడులకు పాల్పడుతున్నాయి. తాజాగా హైదరాబాద్ యూసుఫ్ గూడ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ నగర్ లో షాకింగ్ ఘటన జరిగింది. ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి పాల్పడింది. వెంటనే ఓ వృద్ధుడు కుక్కను తరమడంతో ప్రాణాపాయం తప్పింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

వీధి కుక్క దాడిలో ఓ రెండేళ్ల చిన్నారి గాయపడిన ఘటన హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో జరిగింది. యూసుఫ్ గూడ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ నగర్ లోని ఓ సందులో ఇంటి ముందు బాలుడు ఆడుకుంటున్నాడు. ఇంతలో అదే దారిలో ఓ కుక్క వచ్చింది. బాలుడ్ని చూసిన కుక్క.. వెంటనే ఆ చిన్నారిపై దాడికి యత్నించింది. ఈ క్రమంలో బాలుడు కిందపడి ఏడవసాగాడు. వెంటనే ఇంట్లో నుంచి పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వృద్ధుడు కుక్కను కర్రతో తరమసాగాడు. ఈ క్రమంలో అటుగా వెళ్తున్న మహిళ కూడా బాలుడి వద్దకు వచ్చింది. ఈ ఘటన దృశ్యాలు దగ్గరలోని సీసీ కెమెరాలో నమోదు అయ్యాయి.
హైదరాబాద్‌లో మరో బాలుడిపై వీధి కుక్కల దాడి
— Telugu Scribe (@TeluguScribe) December 5, 2025
యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ నగర్ ప్రాంతంలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన వీధి కుక్క
గాయాలపాలైన బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించిన కుటుంబసభ్యులు
నగరంలో వరుసగా వీధి కుక్కల దాడులు జరుగుతున్నా,… pic.twitter.com/Ak9i7xaQyd
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిత్యం చాలా మంది కుక్క కాటుకు గురవుతున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో కుక్క కాటుకు వైద్యం కోసం రోజూ చాలా మంది చికిత్స తీసుకుంటున్నారు. తాజాగా యూసుఫ్ గూడ పరిధిలోని శ్రీ లక్ష్మీనరసింహ నగర్ లో ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ రెండేళ్ల చిన్నారిపై వీధి కుక్క దాడికి పాల్పడింది. వీధి కుక్క దాడిలో గాయపడ్డ చిన్నారి.. ఒక్కసారిగా ఏడ్వడం ప్రారంభించడంతో అక్కడే ఉన్న బాలుడి తాత.. ఆ కుక్కను కర్రతో తరిమికొట్టాడు. గాయపడిన చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని నగరవాసులు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications