జర్మనీ వెళ్లి తిరిగొచ్చేసరికి ఇల్లు గుల్ల: ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి చోరీ
హైదరాబాద్: జర్మనీ వెళ్లి తిరిగి వచ్చేసరికి దొంగలు ఇంటిని గుల్ల చేశారు. ఇంట్లో ఉన్న బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాదులోని బోయిన్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధిలో రిగింది. స్థానిక సిక్ విలేజీలోని కార్తిక్ ఎన్‌క్లేవ్‌లో నివాసం ఉంటున్న మోహన్ కనోడియా 15 రోజుల క్రితం జర్మనీ వెళ్లారు.
సోమవారం తెల్లవారు జామున ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి తిరిగి వచ్చేసరికి తలుపులు, కిటికీ రెక్కలతో పాటు బీరువా తలుపులు విరిగి కనిపించాయి. లోపలికి వెళ్లి చూస్తే బీరువాలో దాచిన బంగారు ఆభరణాలతో పాటు 76 గ్రాముల వెండి నాణేలు, లక్షన్నర నగదు, తొమ్మిది వాచీలు కనిపించలేదు.

ఇంటి వాచ్‌మన్‌గా బహదూర్ అనే వ్యక్తిని కాపలాగా పెట్టానని, అతను కనిపించడం లేదని మోహన్ కనోడియా చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదిలావుంటే, సికింద్రాబాదులోనే మరో సంఘటన జరిగింది. ఇల్లు అద్దెకు కావాలంటూ వచ్చి మహిళ దృష్టి మళ్లించి ఆమె మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లారు. ఈ సంఘటన సికింద్రాబాదులోని చిలకలగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని బౌద్ధ నగర్ అపార్టుమెంటులోమంగళవారంనాడు జరిగింది.
మధ్యాహ్నం సమయంలో ఆపార్టుమెంట్‌లో ఫ్లాట్ అద్దెకు దొరుకుతుందా అని స్థానిక మహిళను అడిగిన ఇద్దరు దుండగులు ఆ చోరీకి పాల్పడ్డారు. కాసేపటి తర్వాత తన గొలుసు మాయం కావడాన్ని గమనించిన మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
-
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ రివ్యూ.. 5కి ఎంత రేటింగ్ ఇచ్చారంటే..! -
టీమిండియా విజయం వెనుక ప్రభాస్.. అసలు విషయం చెప్పిన సూర్యకుమార్ యాదవ్ -
ఆ హీరోతో లిప్ లాక్ చేశానని మా పేరెంట్స్ తిట్టారు - స్టార్ బ్యూటీ -
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే మీ ఖాతాల్లో..!! -
పేక మేడలా కుప్పకూలుతున్న బంగారం ధరలు -
ప్రపంచంలోనే చీపెస్ట్ కంట్రీ.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి..? -
వాషింగ్టన్ ఎయిర్ పోర్టుల్లో అనూహ్య పరిణామం: యుద్ధ భయాల మధ్య.. !! -
ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం బంపరాఫర్- వంద శాతం సబ్సిడీతో కొత్తగా.. మార్గదర్శకాలు..!! -
అలా చేస్తే గ్యాస్ సిలిండర్ బుకింగ్ సాధ్యం కాదు- కేంద్రం క్లారిటీ.. !!












Click it and Unblock the Notifications