వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాలంటైన్ డే నేపథ్యమేంటీ..? ప్రేమికుల రోజుగా ఎలా మారింది..?

|
Google Oneindia TeluguNews

ప్రేమ..ఎప్పుడూ, ఎక్కడ ఎలా పుడుతుందో తెలియదు. కానీ ప్రేమలో పడితే మాత్రం వారు ప్రపంచాన్ని మరచిపోతారు. ప్రేమ మైకంలో మునిగిపోతారు. కొందరు పెద్దల్నీ ఎదురించి పెళ్లిళ్లు చేసుకొంటుండగా.. మరికొందరు వారిని ఒప్పించి ఒక్కటవుతోన్నారు. ప్రతీ ఏడాది ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు (వాలంటైన్స్ డే) జరుపుకుంటారు. ఇంతకీ వాలంటైన్స్ డే ఎలా ఆవిర్భవించింది. దాని వెనక ఉన్న నేపథ్యం ఏంటీ. వన్ ఇండియా ప్రత్యేక కథనం.

ఇదీ నేపథ్యం..

ఇదీ నేపథ్యం..


మూడో శతాబ్దానికి చెందిన సెయింట్ వాలంటైన్ క్రైస్తవ ప్రవక్త. ఈయన రోమ్ నగరంలో ఉండేవారు. ఆ సమయంలో రెండో క్లాడియన్ చక్రవర్తి రోమ్‌ను పాలించేవారు. తమ హయాంలో పెళ్లిళ్లపై నిషేధం విధించాడు. పురుషులు పెళ్లి చేసుకుంటే మంచి సైనికులు కాలేరిని క్లాడియన్ భావించేవారు. ఈ కారణంతో పెళ్లిళ్లను బ్యాన్ చేశారు.

పెళ్లిళ్లు బ్యాన్

పెళ్లిళ్లు బ్యాన్

రోమ్‌లో పెళ్లిళ్ల నిషేధాన్ని వాలంటైన్ వ్యతిరేకించాడు. క్లాడియన్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రహస్యంగా పెళ్లిళ్లు చేసేవాడు. తర్వాత వాలంటైన్ చేసిన పనిని రాజు తెలుసుకున్నాడు. అతడిని జైలులో వేసి.. ఉరిశిక్ష విధించాడు. జైలులో ఉన్న సమయంలో జైలర్ కుమార్తెతో వాలంటైన్ ప్రేమలో పడ్డారు. ఫిబ్రవరి 14వ తేదీన ఉరిశిక్ష అమలు చేయడానికి ముందు జైలర్ కూతురికి ప్రేమ లేఖ పంపించాడు.

రోమన్లు కూడా..

రోమన్లు కూడా..

దీంతోపాటు ఇతర కథనాలు కూడా ప్రచారంలో ఉన్నాయి. ఫిబ్రవరిలో రోమన్లు లుపర్ కాలియా వేడుకు జరుపుకొంటారు. వసంతకాంలో వచ్చే పండగలో.. ఒక్కొక్కరు కాగితంపై ఒక్కొ అమ్మాయిపై పేరు రాసి వాటిని బాక్సులో వేశారు. తర్వాత అబ్బాయి వచ్చి బాక్సులో చిటీలు తీసేవారు. ఆ స్లిప్‌లో అమ్మాయి పేరు ఉంటే.. పండగలో అతనికి ఆమె ప్రేయసిగా ఉండాలి. అలా జంటలుగా ఉన్నవారు కొన్నిసార్లు పెళ్లి కూడా చేసుకునేవారు. రోమన్ల సంప్రదాయం నుంచి వాలంటైన్స్ డే వచ్చిందని ప్రచారంలో ఉంది.

ఇలా మారింది..

ఇలా మారింది..


రోమన్ల పండుగను కాస్త క్రైస్తవ సంప్రదాయంగా మర్చాలని భావించారు. ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్ చనిపోయారని సూచించారు. వాలంటైన్ గుర్తుగా ఫెస్టివల్ జరుపుకోవాలని చర్చి సూచించారు. దీనిని క్రమంగా వాలంటైన్ పేరుగా మార్చారు. 496 ఏడాదిలో వాలంటైన్స్ డే జరుపుకున్నారని కథలుగా చెప్తుంటారు.

English summary
how it valentines day converted lovers day
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X