ఓటరు స్లిప్ అందలేదా, ఓటు వేసేది ఎలా - ఇలా చేయండి..!!

తెలంగాణలో హై ఓల్టేజ్ ఎన్నికల వార్ కొనసాగుతోంది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 28న ప్రచారం ముగియనుంది. 30న పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే ఓటర్ల జాబితా ఫైనల్ అయింది. ఇక, ఓటు వేయటానికి కీలకమైన ఓటరు స్లిప్పుల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఓటరు స్లిప్పులు అందని వారు ఉన్నారు. మరి..వీరు ఓటు ఎలా వేయాలి. దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు స్పష్టత ఇస్తున్నారు.

పోలింగ్ కు ఏర్పాట్లు: తెలంగాణలో ఈ నెల 30న మొత్తం 119 నియోజకవర్గాల్లో ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అటు బరిలో ఉన్న అభ్యర్దులు ఓటర్లను ఆకట్టుకొనేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీల అగ్రనాయకత్వం హైదరాబాద్ లో మొహరించింది. అటు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఓటర్ల జాబితా సిద్దమైంది.

How to get Voter slips for Telangana poll, check here for the details

ఓటు వేసేందుకు వీలుగా ఎన్నికల సిబ్బంది ఇంటింటికి వెళ్లి ఓటరు స్లిప్పులను అందించారు. ఈ నెల 25తో ఈ ప్రక్రియ పూర్తయింది. ఇంకా ఓటరు స్లిప్పులు అందని వారు ఉన్నారు. మరి వీరు ఓటు వేయటం ఎలా. ఓటరు స్లిప్పు లేకపోయినా..జాబితాలో పేరు ఉంటే ఓటు వేసే అవకాశం ఉంటుంది. గుర్తింపు కార్డులతో ఓటు వేయటానికి అనుమతిస్తారు.

ఓటర్ల స్లిప్పులు కోసం: ఇదే సమయంలో ఓటరు స్లిప్పును ఓటు వేసేందుకు వెళ్లే ముందే పొందేందుకు వీలుగా ఎన్నికల సంఘం వెసులుబాటు కల్పించింది. ఎన్నికల వెబ్ సైట్ లో దీనిని పొందేందుకు అవకాశం ఉంది. డొమైన్ లోకి వెళ్లగానే వెంటనే ఓటరు వివరాలు, సీరియల్‌ నంబర్‌, పోలింగ్‌ కేంద్రం, పోలింగ్‌ సమయం, పోలింగ్‌ స్టేషన్‌ నంబర్‌ తదితర వివరాలు డిస్‌ప్లే అవుతాయి.

ఓటరు నమోదు సమయంలో ఇచ్చిన ఫోన్‌ నెంబర్‌ సాయంతో స్లిప్పును పొందొచ్చు. ఓటు వేయటానికి వెళ్లే వారు తమతో పాటుగా గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి. ఓటర్‌ కార్డ్‌ అందుబాటులో లేకపోతే, ఆధార్‌ కార్డు, బ్యాంకు పాస్‌బుక్‌, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ బుక్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, పాస్‌పోర్టుతో పాటు 12 రకాల గుర్తింపు కార్డుల్లో దేనినైనా పోలింగ్ అధికారికి చూపించి ఓటు వేయొచ్చు.

How to get Voter slips for Telangana poll, check here for the details

గుర్తింపు కార్డుతో ఓటు: దీంతో పాటుగా 'ఓటర్‌ హెల్ప్‌లైన్‌' యాప్‌లోనూ ఓటర్‌ స్లిప్‌ పొందొచ్చు. దీని కోసం ప్లేస్టోర్‌ నుంచి 'ఓటర్‌ హెల్ప్‌లైన్‌' యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. అనంతరం ఆ యాప్‌ సాయంతో ఓటరు కార్డుపై ఉండే క్యూర్‌ కోడ్‌ను స్కాన్‌ చేయాలి. లేదా ఓటరు గుర్తింపు కార్డు నెంబర్‌ ఎంటర్‌ చేయాలి.

వెంటనే మీ వివరాలతోపాటు పోలింగ్‌ కేంద్రం, సమయం తదితర వివరాలన్నీ పొందవచ్చు. దీంతో, గతం కంటే పోలింగ్ శాతం పెరిగేలా ప్రయత్నాలు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 30 హాలిడే కాదని..పోలింగ్ డే అని ఎన్నికల అధికారులు పోలింగ్ లో పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నారు. ఇక, ఈ సారి తెలంగాణ ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+