డ్రగ్ కేసుపై దిగ్విజయ్ సంచలన ట్వీట్, వయసుకు తగ్గట్లు చేయాలని.. కేటీఆర్
డ్రగ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సంచలన ఆరోపణ చేశారు.
హైదరాబాద్: డ్రగ్ ఇష్యూపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ గురువారం సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో సంచలన ఆరోపణ చేశారు.

డిగ్గీ షాకింగ్ కామెంట్లు
డ్రగ్ కుంభకోణంలో టిఆర్ఎస్ వారసుల హస్తం ఉందని డిగ్గీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో భారీ డ్రగ్ స్కాం జరిగిందని, అధికార పార్టీ వారసుల హస్తం ఉందని ట్వీట్ చేశారు. వారందరినీ విచారిస్తారో లేక రక్షిస్తారో చూడాలన్నారు.

కేటీఆర్ ఘాటు స్పందన
దిగ్విజయ్ సింగ్ ట్వీట్ పైన మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఘాటుగా స్పందించారు. డిగ్గీ పూర్తిగా గతి తప్పారన్నారు. ఆయన గౌరవప్రదంగా రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదన్నారు.
Recommended Video


వయసుకు తగ్గ పనులు చేయాలని..
దిగ్విజయ్ వయసుకు తగిన పనులు చేసుకుంటే మంచిదని కేటీఆర్ ట్విట్టర్లో సూచించారు. ఎట్టకేలకు 'తెలంగాణ' స్పెల్లింగ్ నేర్చుకున్నందుకు సంతోషమని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

డ్రగ్స్.. పొలిటికల్ టర్న్, ఇందులోను కేసీఆర్ టార్గెట్
ఇప్పటి వరకు డ్రగ్ రాకెట్ రాజకీయ మలుపు తీసుకోలేదు. కానీ డిగ్గీ ట్వీట్‌తో ఇది రాజకీయంగా కూడా దుమారం రేపేలా కనిపిస్తోంది. డ్రగ్ రాకెట్‌లో కేవలం సినిమా పరిశ్రమ వారినే టార్గెట్ చేస్తున్నారని, అధికార పార్టీ వారి హస్తం కూడా ఉందని, కానీ వారిని మాత్రం పక్కకు తప్పించారని డిగ్గీ ట్వీట్‌లోని అభిప్రాయంగా చెబుతున్నారు.

గతంలోను టార్గెట్...
దిగ్విజయ్ సింగ్ గతంలోను తెలంగాణ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై కూడా అప్పుడు కేటీఆర్ ధీటుగా స్పందించారు.
-
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది -
"తృణమూల్" ఎన్నికల మ్యానిఫెస్టో రిలీజ్.. మమతా బెనర్జీ 10 హామీలు ఇవే..! -
AP Govt: రేపటి టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా..! కొత్త తేదీలివే..!












Click it and Unblock the Notifications