మందుబాబులకు బిగ్ షాక్
తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. ఈసారి మార్చి నెల నుంచి ఎండలు కాస్తా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో 36 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదు అవుతుంది. ఇక ఏప్రిల్, మే నేలలో ఎండలు 50 డిగ్రీలు దాటుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మండుతున్న ఎండలు భరించలేక ప్రజలు ఎక్కడ నీడ ఉంటే అక్కడ ఆశ్రయం పొందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తప్పనిసరి అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచనలు కూడా చేస్తున్నారంటే ఎండ తీవ్రత ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇదిలా ఉంటే ఈ వేసవి మందుబాబులకు సైతం గట్టి షాకిస్తోంది. సమ్మర్ వచ్చిందంటే చాలు బీర్లకు ఎంతటి డిమాండ్ ఉంటుందో అందరికి తెలిసిన విషయమే. విస్కీ ,బ్రాండీ ,వొడ్కా తాగేవారు సైతం వేసవి తాపాన్ని తట్టుకోవడానికి బీర్లు తాగడానికి ప్రాధాన్యతను ఇస్తుంటారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో బీర్ల కొరత ఏర్పడింది. డిమాండ్‌కి తగ్గట్లు బీర్ల సప్లై లేదని విమర్శలు వస్తున్నాయి. వేరే రాష్ట్రాలతో పోలిస్తే సాధారణంగానే తెలంగాణ రాష్ట్రంలో మందుబాబుల సంఖ్య అధికంగా కనిపిస్తోంది.

మద్యం ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయం వస్తుంటుంది. అయితే సమ్మర్‌లో మందుబాబులు ఎక్కువగా బీర్లను ఇష్టపడుతుంటారు. ప్రతిరోజూ గ్రేటర్ లో 60 వేల నుంచి 80 వేల కేసులకు పైగా బీర్లు అమ్ముడు పోతున్నాయని అంచనా. అయితే ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. మరో 20వేల కేసుల బీర్లు కావాలని డిమాండ్ ఉన్నప్పటికీ సప్లై చేయడంలో ఆయా కంపెనీలు వెనకపడ్డాయి.
దీంతో రాష్ట్రంలో,ముఖ్యంగా హైదరాబాద్‌లో బీర్ల కొరత కనిపిస్తోంది. కొన్ని చోట్ల కొన్ని బ్రాండ్ల బీర్లు దొరకని పరిస్థితి. మరికొన్ని ప్రాంతాల్లో అయితే బీర్ల స్టాక్ లేదని బోర్డులు పెడుతున్నారు. కూలింగ్ లేని బీర్లను సైతం కొనుగొలు చేయడానికి యూత్ ఆసక్తి చూపిస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
గత ఏడాది ఏప్రిల్‌తో గ్రేటర్ లో సుమారు 12 లక్షల కేసులకు పైగా బీర్లు అమ్మకాలు జరిగాయని.. ఈ ఏడాది 15 లక్షల కేసులకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. బీర్ల కొరతతో మందుబాబులు అల్లాడిపోతున్నారు. దీంతో ఇప్పుడు రాష్ట్రంలో నీటి కొరత కన్నా కూడా బీర్ల కొరత ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది.
-
అలా చేస్తే శాశ్వతంగా నష్టపోతాం -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications