హైదరాబాద్‌లో భారీ చోరీ... 75 తులాల బంగారం, రూ.2.50 లక్షల నగదు మాయం !

హైదరాబాద్‌ నగరంలోని చాదర్‌ఘాట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్న భారీ చోరీ స్థానికులను షాక్‌కు గురి చేసింది. ఫహిముద్దీన్‌ అనే వ్యాపారి ఇంట్లో దుండగులు హత్తుకున్న స్వర్ణాభరణాలతో పాటు లక్షల రూపాయల నగదును అపహరించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటనలో 75 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును అపహరించారని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే.. వ్యాపారవేత్త ఫహిముద్దీన్ భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీంతో శుక్రవారం రాత్రి ఫహిముద్దీన్ తన తల్లిదండ్రులను ఇంట్లో వదిలి ఆసుపత్రికి వెళ్లారు. ఇదే అవకాశంగా భావించిన దుండగులు ఇంటి వెనుక భాగంలో గోడ దాటి లోపలికి ప్రవేశించారు. ఇంట్లోకి చొరబడిన దొంగలు అత్యంత చాకచక్యంతో వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు. ఫహిముద్దీన్‌ తల్లిదండ్రులు నిద్రిస్తున్న గదికి బయట నుంచి గొళ్లెం పెట్టి తాళం వేసి చుట్టుపక్కల ఎవరూ గుర్తించకుండా జాగ్రత్తగా పని కానిచ్చినట్టు భావిస్తున్నారు.

huge-theft-in-hyderabad-that-75-tulas-of-gold-and-rs-2-50-lakh-cash-stolen

అంతేకాకుండా, చోరీ చేసేముందు ఫ్రిజ్‌లో ఉన్న పండ్లు తిన్నట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం బెడ్‌రూమ్‌లో ఉన్న బీరువాను పగులగొట్టి అందులో దాచిన 75 తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును అపహరించారు. బంగారం మాత్రమే కాకుండా, కొన్ని విలువైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు కూడా మాయం చేసినట్లు బాధితుడు పేర్కొన్నారు. తెల్లవారుజామున ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన ఫహిముద్దీన్ చోరీ జరిగిన విషయాన్ని గమనించి వెంటనే చాదర్‌ఘాట్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని క్లూస్‌ టీమ్‌ను రప్పించి ఫింగర్‌ప్రింట్లు సేకరించారు. ఇంటి చుట్టూ ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. చోరీకి ముందుగానే ఇంటిని గమనించి పక్కా ప్లాన్‌తో దొంగతనం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. స్థానిక చుట్టుపక్కలున్న ఇతర ఇళ్లను కూడా అడిగి ప్రాథమిక సమాచారం సేకరిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేశారు. త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామంటూ చాదర్‌ఘాట్‌ పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+