కవిత విచారణ వేళ భారీ ట్విస్ట్ - ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల వేళ ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విచారణకు రావాలంటూ ఈడీ నోటీసుల వేళ ఈ వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఇప్పటి వరకు 11 మంది అరెస్ట్ అయ్యారు. ఇందులో రామచంద్రన్ పిళ్లైను ఈడీ ఇప్పటి వరకు 29 సార్లు విచారించింది. పిళ్లై విచారణలో భాగంగా ఇచ్చిన స్టేట్ మెంట్ తో ఈడీ కవితకు నోటీసులు జారీ చేసింది. కవితతో పాటుగా పిళ్లైను కలిపి విచారించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పుడు పిళ్లై తాను ఇచ్చిన స్టేట్ మెంట్ వెనక్కు తీసుకుంటున్నట్లు కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. కవిత విచారణకు హాజరు అవ్వటానికి ముందు చోటు చేసుకున్న ఈ పరిణామం కీలకంగా మారుతోంది.

ఢిల్లీ లిక్కర్ కేసులో రామచంద్ర పిళ్లైను ఈడీ ఇప్పటి వరకు 29 సార్లు విచారించింది. ఆయన నుంచి 11 సార్లు స్టేట్ మెంట్లు రికార్డు చేసింది. తాజాగా 5 రోజుల పాటు పిళ్లైను విచారించిన ఈడీ రిమాండ్ రిపోర్టులో పలు అంశాలను ప్రస్తావించింది. పిళ్లై తాను కవితకు బినామీగా పేర్కొన్నట్లు ప్రస్తావించింది. పిళ్లై ఇచ్చిన విచారణ ఆధారంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చారు. రేపు (11వ తేదీ) కవిత ఈడీ ముందుకు విచారణకు వెళ్లాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రామచంద్ర పిళ్లై కోర్టులో పిటీషన్ దాఖలు చేసారు. తాను ఈడీకి ఇచ్చిన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకుంటున్నట్లు అందులో పేర్కొన్నారు. దీంతో...పిళ్లై దాఖలు చేసిన పిటీషన్ పైన ఈడీకి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది.

Huge twist in Delhi liquor case, Ramchandra Pillai files petition in court to take back his statment given to ED

పిళ్లై తన స్టేట్ మెంట్ ను వెనక్కు తీసుకుంటున్నట్లుగా పిటీషన్ దాఖలు...చేయటం కోర్టు ఈడీకి నోటీసులు ఇవ్వటంతో ఇప్పుడు ఈ వ్యవహారం ఆసక్తి కరంగా మారుతోంది. కవిత తొలి నుంచి ఢిల్లీ లిక్కర్ కేసులో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు. తాజాగా ఈడీ నోటీసుల వెనుక రాజకీయ కుట్ర ఉందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఈడీ నోటీసులు ఇవ్వటంతో విచారణకు హాజరు అవుతానని ఇప్పటికే కవిత స్పష్టం చేసారు. ప్రస్తుతం ఢిల్లీలో మహిళా రిజర్వేషన్ బిల్లు డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నారు. రేపు ఈడీ ముందుకు వెళ్లనున్నారు. ఇప్పుడు పిళ్లై పిటీషన్ తో ఈ కేసులో రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటానే ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+