హైదరాబాద్ లో అమ్మేది నెయ్యి కాదు..! కొంటే మీరు షెడ్డుకే..!
నెయ్యిలో అనేక పోషక విలువలు ఉంటాయి. చిన్న పిల్లలకు నెయ్యితో చేసిన పదార్థాలను ఎక్కువగా పెడుతుంటారు. ఇక ఇతర వంటల్లోనూ నెయ్యి జోడిస్తే ఆ రుచే వేరు అన్నట్లుగా ఉంటుంది. అయితే నగరంలో స్వచ్ఛమైన నెయ్యి దొరకడం చాలా కష్టం. కానీ చేసేదేంలేక నగర ప్రజలు నగరంలోనే నెయ్యి కొనుగోలు చేస్తుంటారు. అయితే అలాంటి వారికి ఇప్పుడో షాకింగ్ న్యూస్.. హైదరాబాద్ నగరంలో కల్తీ నెయ్యి దందా పెరిగిపోతుంది. తాజాగా రూ. 18 లక్షలకు పైగా విలువైన 460 కిలోల కల్తీ నెయ్యిని అధికారులు సీజ్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న నగర వాసులు ఒక్కసారిగా షాక్ కు గురవుతున్నారు.
హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో భారీగా కల్తీ నెయ్యి పట్టుబడింది. ప్రైడ్ డెయిరీ అనే సంస్థ కల్తీ నెయ్యి తయారు చేస్తోందని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో నగర టాస్క్ ఫోర్స్ పోలీసులు, మాసబ్ ట్యాంక్ పోలీసులు సంయుక్తంగా బంజారాహిల్స్ లోని ప్రైడ్ డెయిరీ సంస్థపై దాడులు నిర్వహించారు. దాదాపు 460 కిలోల కల్తీ నెయ్యిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ నెయ్యి విలువ సుమారు రూ.18 లక్షలకుపైగానే ఉంటుందని సమాచారం.

ఈ కల్తీ నెయ్యిని నగరంలోని వివిధ రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ నెయ్యిని వనస్పతి నూనె, పామాయిల్, ఇతర రసాయనాలతో తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ నెయ్యి ఘటనలో నిందితుడు జునైద్ హుసెన్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దందాపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు నగర వాసులకు పోలీసులు తగు సూచనలు చేశారు. ఇలాంటి పదార్థాలు కొనుగోలు చేసేముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు.
-
హైదరాబాద్లో దివంగత మాజీ సీఎం జయలలిత భవనం సీజ్ -
దానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీ.. ప్రజల కోసం సీఎం రేవంత్ నిర్ణయం! -
ఆ యూనివర్సిటీలో ఎలుకల భయం.. 11మంది విద్యార్థులను కరిచిన ఎలుకలు! -
శివయ్య పిలుస్తున్నాడంటూ లేఖ.. యువతి అదృశ్యం ! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..!












Click it and Unblock the Notifications