విమానయానం చేసే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్.. ఆ చార్జీలు కట్, త్వరలో అమలు!

విమానయానం చేసే ప్రయాణికుల కోసం ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ సెప్టెంబర్ నుండి కొత్త టారిఫ్ లను తీసుకువస్తుంది. హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి శుభవార్త చెప్పింది. ఎయిర్‌పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ (ఏఈఆర్‌ఏ) యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు యూడీఎఫ్ ను గణనీయంగా తగ్గించింది.

సెప్టెంబర్ 1 నుంచి కొత్త టారిఫ్ లు

దేశీయ ప్రయాణికులపై ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.750ను రూ.515కు తగ్గించారు. అంతర్జాతీయ ప్రయాణికుల యూడీఎఫ్ రూ.1,500 నుంచి రూ.1,030కు తగ్గింది.ఈ కొత్త ఛార్జీలు 2026 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి 2031 మార్చి 31 వరకు కొనసాగుతాయి. విమానాశ్రయ నిర్వహణ సంస్థ దేశీయ ప్రయాణికులకు రూ.580, అంతర్జాతీయులకు రూ.1,150 ప్రతిపాదించగా.. ఏఈఆర్‌ఏ అంతకంటే తక్కువగా నిర్ణయించింది.

రైళ్లల్లో ప్రయాణికుల చేతివాటం: నిరంతరం చోరీకి అవుతున్న వస్తువులు
రైళ్లల్లో ప్రయాణికుల చేతివాటం: నిరంతరం చోరీకి అవుతున్న వస్తువులు
Hyderabad Airport Passengers Get Relief as AERA Cuts User Development Fee implements from september 1st

కొత్తగా 'ఇన్‌క్రిమెంటల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్' విధానం

దీనితో దేశీయ ప్రయాణికులకు రూ.235 మేర ఆదా అవుతుంది. అంతేకాదు ల్యాండింగ్ ఛార్జీలు కూడా సవరించారు. దేశీయ విమానాలకు మెట్రిక్ టన్నుకు రూ.435, అంతర్జాతీయ విమానాలకు రూ.630గా ఖరారు చేశారు.కొత్తగా 'ఇన్‌క్రిమెంటల్ అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్' విధానం ప్రవేశపెట్టారు. దీని ప్రకారం కొత్త టెర్మినల్, రన్‌వే వంటి భారీ అభివృద్ధి పనుల ఖర్చును ప్రాజెక్టులు పూర్తై వినియోగంలోకి వచ్చిన తర్వాతే రికవరీ చేస్తారు.

విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులకు అరైవల్ చార్జీలు

ముందస్తుగా ప్రయాణికులపై భారం వేయరు. విమానాశ్రయం రూ.27,851 కోట్ల అగ్రిగేట్ రెవెన్యూ రిక్వైర్‌మెంట్ ప్రతిపాదించగా, ఏఈఆర్‌ఏ రూ.11,683.49 కోట్లను ప్రాథమికంగా పరిగణించి ఒక్కో ప్రయాణికుడిపై సగటు ఆదాయాన్ని రూ.426.39గా నిర్ణయించింది. విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు అరైవల్ చార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. దేశీయంగా వచ్చే వారికి రూ. 220, అంతర్జాతీయంగా వచ్చే వారికి రూ. 440 చొప్పున ఈ ఛార్జీని నిర్ణయిస్తూ ఆగస్టు 24న ఏఈఆర్ఏ (AERA) ఉత్తర్వులు జారీ చేసింది.

ముంబై మిస్సింగ్ లింక్ దెబ్బ: ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం
ముంబై మిస్సింగ్ లింక్ దెబ్బ: ప్రయాణికుల బాధలు వర్ణనాతీతం

యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు తగ్గిస్తూ నిర్ణయంతో ప్రయాణికులకు రిలీఫ్

యూజర్ డెవలప్‌మెంట్ ఫీజు తగ్గిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారికి టికెట్ ధరల్లో కొంత ఉపశమనం లభించనుంది. అదే సమయంలో భవిష్యత్ అభివృద్ధి భారం ప్రస్తుత ప్రయాణికులపై పడకుండా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+