ఉబేర్ డ్రైవర్ నన్ను కొట్టాడు, లేడీ ఫ్రెండ్‌పై అసభ్యంగా ప్రవర్తించాడు: వ్యాపారి

హైదరాబాద్: ఉబేర్ డ్రైవర్ తనను కొట్టడమే కాకుండా తన స్నేహితురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని సికింద్రాబాదుకు చెందిన 27 ఏళ్ల వ్యాపారి బేగంపేట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అభినవ్ సుంకర అనే వ్యాపారి సికింద్రాబాదులో అడ్వర్టయిజింగ్, బ్రాండింగ్ సంస్థను నడుపుతున్నారు. ఉబేర్ డ్రైవర్ సయ్యద్ అహ్మద్‌పై ఆయన బుధవారం రాత్రి ఫిర్యాదు చేశారు.

సికింద్రాబాదు నుంచి ఫిల్మ్ నగర్ వైపు వెళ్తుండగా ఉబేర్ డ్రైవర్ అహ్మద్ తనపై చేయి చేసుకోవడమే కాకుండా తన స్నేహితురాలిని దూషించాడని సుంకర ఆరోపించారు. సికింద్రాబాదులోని కార్ఖానా నుంచి హైదరాబాదులోని ఫిల్మ్‌నగర్‌కు తన స్నేహితురాలితో పాటు తాను వెళ్లడానికి అభినవ్ సుంకర ఉబేర్ క్యాబ్‌ను మాట్లాడుకున్నారు.

ఫిల్మ్ నగర్‌కు మార్గాన్ని చెప్పడానికి తాము ప్రయత్నిస్తుండగా ఉబేర్ క్యాబ్ డ్రైవర్ దురుసుగా ప్రవర్తించాడని అభినవ్ సుంకర విమర్శించారు. తన స్నేహితురాలితో సరిగా మాట్లాడాలని తాను అడగడంతో డ్రైవర్ పరేడ్ గ్రౌండ్స్ వద్ద క్యాబ్‌ను ఆపేసి దిగి పోవాలని చెప్పాడని ఆయన వివరించారు. మధ్యలో ఆపేస్తే డబ్బులు ఇవ్వబోనని తాను చెప్పానని ఆయన తన ఫిర్యాదులో చెప్పారు.

Hyderabad businessman says Uber driver hit him, abused his lady friend

గొడవ ఎందుకని చెప్పి అతని వంద రూపాయలు ఇచ్చేసి వెళ్లిపోవాల్సిందిగా చెప్పానని, 60 రూపాయలు మాత్రమే బిల్లు అయినప్పటికీ తాను వంద రూపాయలు ఇచ్చానని ఆయన చెప్పారు. ఆ తర్వాత అభినవ్ సుంకర పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు.

తమ వద్దకు రావాలని క్యాబ్ డ్రైవర్‌ను అడిగామని పోలీసులు అంటున్నారు. ఆ తర్వాత అతను ఫోన్ స్విచ్ఛాప్ చేశాడని చెబుతున్నారు. కారు అహ్మద్ పేరు మీద రిజిష్టర్ కాలేదని చెప్పారు. అభినవ్ సుంకర ఉబేర్ సంస్తకు విషయం చెప్పారు. డ్రైవర్‌ను సస్పెండ్ చేసినట్లు ఉబేర్ సంస్థవాళ్లు చెప్పారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+