సీఆర్పీఎఫ్ సదరన్ సెక్టార్ తొలి మహిళా ఐజీపీగా చారు సిన్హా
తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి చారు సిన్హా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పిఎఫ్ సదరన్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు తీసుకున్నారు.
హైదరాబాద్: తెలంగాణ కేడర్ 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి చారు సిన్హా గురువారం జూబ్లీహిల్స్‌లో సీఆర్‌పిఎఫ్ సదరన్ సెక్టార్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా బాధ్యతలు తీసుకున్నారు. సీఆర్‌పీఎఫ్ జమ్మూ సెక్టార్‌కు పోస్ట్ చేయబడిన మహేష్ చంద్ర లడ్డా నుంచి ఆమె బాధ్యతలు స్వీకరించారు.
కాగా, సదరన్ సెక్టార్ ఐజీపీగా బాధ్యతలు చేపట్టిన తొలి మహిళా అధికారిణి చారు సిన్హా రికార్డు సృష్టించారు. చారు సిన్హా ఇంతకుముందు జమ్మూ సెక్టార్‌లో ఐజీపీగా ఒక సంవత్సరం పాటు పనిచేశారు. దీనికి ముందు శ్రీనగర్ సెక్టార్‌కు 2 సంవత్సరాల 6 నెలల పాటు, జమ్మూ కాశ్మీర్‌లో మూడున్నర సంవత్సరాలు పనిచేశారు.

గతంలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు బీహార్ సీఆర్‌పీఎఫ్ కమాండ్ మొదటి మహిళా సీఆర్‌పీఎఫ్ ఐజీగా కూడా చారు సిన్హా ఉన్నారు. సిఆర్‌పిఎఫ్‌కి డిప్యూటేషన్‌ని ఇవ్వకముందు, ఆమె తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో వేర్వేరు పదవులను నిర్వహించారు.
చారు సిన్హా ప్రకాశం, నిజామాబాద్, మెహబూబ్ నగర్, చిత్తూరు, తూర్పుగోదావరి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఎస్పీగా పనిచేశారు. అల్బేనియన్ ముస్లింలు, క్రిస్టియన్ సెర్బ్‌ల మధ్య సంఘర్షణతో నలిగిపోయిన ప్రాంతంలో శాంతి పరిరక్షణ కోసం డిప్యుటేషన్‌పై కొసావోలోని ఐక్యరాజ్యసమితి మిషన్‌కు ఆమె వెళ్లారు, అందులో ఆమె వృత్తిపరమైన సేవల విభాగాన్ని నిర్వహించారు.
చారు సిన్హా హైదరాబాద్‌లోని సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ ఫర్ ఉమెన్ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్‌లో పట్టభద్రురాలయ్యారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి పొలిటికల్ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు.
చారు సిన్హా తెలంగాణ అవినీతి నిరోధక బ్యూరో డైరెక్టర్‌గా, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం, చిత్తూరు, తిరుపతి జిల్లాలతో కూడిన అనంతపురం రేంజ్‌కు డీఐజీగా కూడా పనిచేశారు. ఈ ప్రాంతంలోని తీవ్ర హింసాత్మకమైన కక్షలు, మతతత్వం, ఇతర సమస్యలను నియంత్రించారు.












Click it and Unblock the Notifications