హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సెక్స్ రాకెట్: జంట అరెస్ట్, బెంగాల్ యువతితో నగరంలో వ్యభిచారం

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మాయమాటలతో పశ్చిమబెంగాల్ రాష్ట్రం నుంచి నగరానికి యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్న ఓ జంటను గొల్గొండ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే... కళ్యాణ్, చంద్రకళ భార్య భర్తలు. షాకిపేటలోని ఉస్మానియా కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని గత కొన్ని రోజులుగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

ఈ మేరకు స్థానికులు ఫిర్యాదు చేయడంతో వ్యభిచారం జరుగుతుందని సమాచారం అందుకున్న పోలీసులు ఇంటిపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో వ్యభిచారం నిర్వహిస్తున్న భార్యభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువతిని ఈ వ్యభిచార వృత్తి నుంచి కాపాడారు.

 Hyderabad: Couple held for running sex racket

కళ్యాణ్ కోల్‌కత్తా నుంచి పెద్ద ఎత్తున అమ్మాయిలను ఉద్యోగాల పేరుతో మాయమాటలు చెప్పి తీసుకొస్తే, చంద్రకళ ఇక్కడ వారితో వ్యభిచారం నిర్వహిస్తోందని గోల్కొండ ఇన్‌స్పెక్టర్ సయ్యద్ ఫయాజ్ తెలిపారు. ఓ స్నేహితురాలి ద్వారా తనను కలిసిన ఆ యువతికి హైదరాబాద్‌లో నెలకు 40వేల వచ్చే వస్తాయని నమ్మించారని తెలిపారు.

వ్యభిచార కేంద్ర నిర్వాహకుడిపై పీడీ చట్టం

వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్న వ్యక్తిపై సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ పీడీ చట్టాన్ని ప్రయోగించారు. వనస్థలిపురం సచివాలయ నగర్‌కు చెందిన పాల వ్యాపారి అమ్మపురెడ్డి నాని అలియాస్ నల్లనాని వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అమాయక యువతుల్ని ఈ రొంపిలోకి లాగుతున్నాడు. గతంలో ఇతడిపై ఐదు కేసులు నమోదు చేసినా తీరు మార్చుకోకపోవడంతో తాజాగా పీడీ చట్టాన్ని ప్రయోగించారు.

English summary
The Golconda police raided a house in the OU colony at Shaikpet on Thursday and nabbed a couple for allegedly organising prostitution and a 25-year-old Kolkata-based sex worker was rescued, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X