నేడు సుబ్బరాజు: ఓపిగ్గా.. పూరీ జగన్నాథ్ ముందే సిద్ధం!, అలా షాకింగ్ వాస్తవాలు
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజును సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది.
హైదరాబాద్: డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా నటుడు సుబ్బరాజును సిట్ (ప్రత్యేక దర్యాఫ్తు బృందం) శుక్రవారం విచారించనుంది.
ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె నాయుడును విచారించారు. మూడో రోజు సుబ్బరాజును విచారిస్తున్నారు.

నిబ్బరంగా పూరీ జగన్నాథ్
విచారణ నిమిత్తం ఎక్సైజ్ కార్యాలయానికి వచ్చిన పూరీ జగన్నాథ్ చాలా నిబ్బరంగా కనిపించాడు. అధికారులు అడిగిన ప్రశ్నలకు తడుముకోకుండా సమాధానం చెప్పాడని తెలుస్తోంది. పలుమార్లు అధికారులు ఆయనకు ఆధారాలు చూపించి, ఇరకాటంలో పడేశారు. అప్పుడు మినహా మిగిలిన సందర్భాల్లో నిబ్బంగా సమాధానం చెప్పాడనితెలుస్తోంది.
Recommended Video


రాత్రి వరకు ఓపిగ్గా..
దీనిని బట్టి చూస్తుంటే ముందుగానే పూరీ మానసికంగా సన్నద్ధమైనట్లు అధికారులు భావిస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటల తర్వాత కూడా ఒప్పిగ్గానే ఉన్నాడని, తమకు సహకరించాడని అధికారులు చెబుతున్నారు. కాగా పూరీకి చెందిన రక్త నమూనాలు, వెంట్రుకలు, గోళ్లను సేకరించి పరీక్షల నిమిత్తం వాటిని రెడ్‌హిల్స్‌లోని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి పంపారు. శ్యామ్ కె నాయుడు కూడా నిబ్బరంగానే సమాధానం చెప్పారని తెలుస్తోంది.

శ్యామ్ కె నాయుడు అలా చెప్పారా
డ్రగ్స్ దందాలో సినీ ప్రముఖులను విచారిస్తున్న పోలీసులు దూకుడు ప్రదర్శిస్తున్నారు. తనకు సిగిరెట్ తాగే అలవాటు కూడా లేదని, డ్రగ్స్ ఎందుకు వాడుతారో కూడా తెలియదని శ్యామ్ కే నాయుడు విచారణ సందర్భంగా చెప్పారని, అలా చెప్పగానే అధికారులు నవ్వారని తెలుస్తోంది. అనంతరం తమకు అంతా తెలుసని, ఎవరు ఏం తీసుకుంటారో, తీసుకోరో కూడా తమకు తెలుసని అధికారులు చెప్పారని సమాచారం.

అలా మరిన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు
ఇందుకు సంబంధించి వివరాలు అతని ముందు పెట్టడంతో శ్యామ్ కె నాయుడు అవాక్కయ్యారని, సినిమా షూటింగ్ సమయంలో తాను డ్రగ్స్ చూశానని చెప్పగా, ఒక పార్టీలో ఆయన ఉన్న ఫోటోలు కూడా చూపించడంతో శ్యామ్ కే నాయుడు మరిన్ని వివరాలు చెప్పారని తెలుస్తోంది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
'ధురంధర్ 2'పై టాలీవుడ్ హీరోల ప్రశంసలు.. ప్రకాష్ రాజ్ రియాక్షన్ ఇదే!












Click it and Unblock the Notifications