వైరల్ వీడియో: వాషింగ్టన్, టెక్సాస్ కాదు.. మన హైదరాబాదే..!

ఈ వీడియోలో కనిపిస్తున్నది ఏ వాషింగ్టనో లేక టెక్సాసో కాదు మన హైదరాబాదే.. దీపావళి సందర్భంగా హైదరాబాద్ అందాలను తమ డ్రోన్ లలో బంధించారు కొందరు ఔత్సాహికులు. ఓ వైపు టపాసుల వెలుగులు.. మరోవైపు నగరం మొత్తం లైటింగ్స్ తో నిండిపోయి.. ఓ విజ్యూవల్ వండర్ గా భాగ్యనగరం నిలుస్తోంది. దీపావళి సందర్భంగా కొందరు ఔత్సాహికులు దివాలీ వెలుగుల్లో హైదరాబాద్ అందాలను చిత్రీకరించారు. ఆ దృశ్యాలు చూస్తే ఇవి అమెరికా, జపాన్, సింగపూర్ లోని హైటెక్ నగరాల మాదిరి కళ్లు చెదిరే విధంగా ఉన్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Hyderabad Glows Bright Viral Diwali Night Video Captures City s Dazzling Festive Magic

తెలంగాణ రాజధాని హైదరాబాద్ రోజురోజుకూ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. నిత్యం అనేక కొత్త కంపెనీలు ఇక్కడ వెలుస్తున్నాయి. చారిత్రక కట్టడాలు, స్థానిక సంస్కృతి, సంప్రదాయాలకు భాగ్యనగరం వేదికగా నిలుస్తోంది. తాజాగా దీపావళి సందర్భంగా హైదరాబాద్ నైట్ వ్యూను కొందరు ఔత్సాహికులు చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. భాగ్యనగరంలోని ప్రధాన ప్రాంతాలను ఆకాశం నుంచి కవర్ చేశారు. ఓ వైపు క్రాకర్స్ , టపాసుల వెలుగులు.. మరోవైపు నగరంలోని లైట్స్ చూపరులను ఆకట్టుకుంటున్నాయి.

హ్యాపీ దీపావళి అని హైదరాబాద్ నైట్ వ్యూ అందాలను చూపిస్తూ పోస్టు పెట్టారు. ఈ 29 సెకన్ల వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది టెక్సాస్ లేదా వాషింగ్టన్ కాదు.. ఇది మన హైదరాబాద్.. ఓ విజ్యూవల్ వండర్ లా ఉంది. హ్యాపీ దీపావళి అని ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. అయితే ఈ వీడియోపై పలు రకాలుగా కామెంట్స్ వినిపిస్తున్నాయి. గ్రౌండ్ రియాలిటీ వేరేగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. నగరంలోని కాలుష్యం సంగతి ఏంటని మరొకతను కామెంట్ చేశాడు. సిటీలో లైట్స్ అలాగే ఉంటాయని.. సిటీ బయట మురికి కాలువలు ప్రవహిస్తున్నాయంటూ మరొకతను కామెంట్ పెట్టాడు. థ్యాంక్యూ సీబీఎన్ అని మరొకతను కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+