Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కు షాక్- ఇకపై

హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా వ్యాపార కార్యకలాపాలు, భూముల క్రయ విక్రయాలను కొనసాగిస్తోన్న రియల్ ఎస్టేట్ సంస్థలకు షాక్ తగిలింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు తమ వాణిజ్య ప్రకటనల్లో రెరా రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చడం ఇక తప్పనిసరి అయింది. రెరా రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా అడ్వర్టయిజ్మెంట్లు ఇవ్వడం, భారీ హోర్డింగులను ఏర్పాటు చేయడం కుదరదు. ఈ మేరకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీజీ-రెరా) నోటీసులు ఇచ్చింది.

టీజీ-రెరా రిజిస్ట్రేషన్ లేకుండానే ప్రీ-లాంచ్ ప్రకటనలు చేయవద్దని రియల్ ఎస్టేట్ ప్రమోటర్లు, డెవలపర్లు, ఏజెంట్లు, ప్రకటనల ప్లాట్‌ఫామ్‌లను కూడా ఈ రెగ్యులేటరీ అథారిటీ హెచ్చరించింది. రెరా రిజిస్ట్రేషన్ నంబర్లను పొందుపర్చకపోవడం రియల్ ఎస్టేట్ (నియంత్రణ- అభివృద్ధి) చట్టం, 2016ను ఉల్లంఘించినట్టేనని స్పష్టం చేసింది. ఈ చట్టం కింద 500 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం, ఎనిమిది యూనిట్లకు పైగా గల ప్రతి ప్రాజెక్ట్ అమ్మకాలు లేదా ప్రచారం ప్రారంభించే ముందు టీజీ-రెరాతో నమోదు చేసుకోవాలి.

Hyderabad Mandatory RERA Registration Now Required for Real Estate Project Advertisements and Hording

ప్రాజెక్ట్ వివరాలను అథారిటీ పరిశీలించి, రిజిస్ట్రేషన్ సంఖ్య జారీ చేసిన తర్వాత మాత్రమే డెవలపర్లు వాటిని ప్రచారం చేయాల్సి ఉంటుంది. ఆ సంఖ్య అన్ని హోర్డింగులు, అడ్వర్టయిజ్మెంట్లల్లో ప్రముఖంగా కనిపించాలే ముద్రించాలి. ఇప్పటికే పలువురు రియల్టర్లు, ప్రమోటర్లు.. రిజిస్ట్రేషన్ నంబర్ లేకుండా వాణిజ్య ప్రకటనలను జారీ చేసినట్లు గుర్తించింది టీజీ రెరా. దీంతో అనేక ప్రాజెక్ట్ డెవలపర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

నోటీసులు అందుకున్న వారిలో గోద్రెజ్ ప్రాపర్టీస్, నవనామీ ఎలివేట్ ప్రాజెక్ట్, వర్టెక్స్ విరాట్ ప్రాజెక్ట్, స్వర్గసీమ అమేయ ప్రాజెక్ట్, తిరుమల హిల్స్ వంటి ప్రముఖ సంస్థలు ఉన్నాయి. కొన్ని కంపెనీలు రిజిస్ట్రేషన్ నంబర్‌ను ప్రస్తావించినా, ప్రకటనల నిబంధనలను పూర్తిగా పాటించలేదని టీజీ-రెరా వెల్లడించింది. స్వర్గసీమ కన్‌స్ట్రక్షన్స్ కు చెందిన అమేయ ప్రాజెక్టుకు సంబంధించి అథారిటీ నిర్దిష్ట ఉల్లంఘనలను గుర్తించింది.

అమేయ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ కు సంబంధించిన అడ్వర్టయిజ్మెంట్లల్లో రెరా నిర్దేశించిన ఫాంట్ సైజు నిబంధనలు పాటించకపోవడం, పూర్తి ప్రాజెక్ట్ పేరు లేకపోవడం వంటి లోపాలను అథారిటీ గమనించింది. ఈ ప్రాజెక్ట్ లే అవుట్ గా నమోదైంది గానీ, ప్లాట్ల కొనుగోలుదారులను తప్పుదారి పట్టించేలా పూర్తి స్థాయి నివాస ప్రాజెక్ట్ గా ప్రచారం చేసినట్లు అథారిటీ తెలిపింది. ఈ ఉల్లంఘనలపై సంస్థకు షోకాజ్ నోటీసు జారీ అయింది.

సరైన రిజిస్ట్రేషన్ పొందకుండా ప్రీ-లాంచ్ ప్రకటనలు విడుదల చేయవద్దని లేదా పెట్టుబడులను ఆకర్షించవద్దని ప్రమోటర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ప్రకటనల సంస్థలను అథారిటీ హెచ్చరించింది. లాంఛనప్రాయ అనుమతులు లేకుండా కొనుగోలుదారులను ఆకర్షించడం అనేది నేరుగా రెరా ఉల్లంఘించడమేనని స్పష్టం చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+