Hyderabad: ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్: నగరంలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుడి మల్కాపూర్‌​లోని అంకుర హాస్పిటల్​లో ఫైర్ యాక్సిడెంట్ మరిచిపోకముందే ఉప్పల్ సీఎంఆర్ షాపింగ్ మాల్​లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. మంగళవారం రాత్రి మాల్ ముందు భాగంలో అంటుకున్న మంటలు మాల్ అంతటికీ శరవేగంగా వ్యాపించాయి.

మాల్ ముందు భాగంలో ఏర్పాటు చేసిన డెకరేషన్​లో మంటలు అంటుకున్నాయని తెలుస్తోంది. ఆ తర్వాత షాపింగ్ మాల్ మొత్తం మంటలు భారీగా వ్యాపించాయి. వెంటనే అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న నాలుగు ఫైరింజినట్లు మంటలను ఆర్పివేసేందుకు తీవ్రమంగా శ్రమిస్తున్నారు.

Hyderabad: Massive fire accident in CMR shopping mall in Uppal

అగ్ని ప్రమాదం కారణంగా సీఎంఆర్ షాపింగ్ మాల్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మాల్ మూసే సమయంలో ప్రమాదం సంభవించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో భారీ ఆస్తి నష్టం జరిగినప్పటికీ.. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.

కాగా, ఉప్పల్ పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన తరువాతే ఆస్తి నష్టం, ఎవరికైనా ఎలాంటి గాయాలు జరిగాయా? అనేది తేలే అవకాశం ఉంది.

మద్యం మత్తులో ఒకరిని బలి తీసుకున్న జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్

జీహెచ్ఎంసీ ఆటో డ్రైవర్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రభుత్వ సంస్థ పరిధిలో పనిచేస్తున్న అనే బాధ్యత లేకుండా మద్యం మత్తులో ఓ జీహెచ్​ఎంసీ ఆటో డ్రైవర్​ ఘోర రోడ్డు ప్రమాదానికి కారకుడయ్యాడు. జీహెచ్​ఎంసీ మున్సిపల్ కార్పొరేషన్ తరపున ఇంటింటి‌ చెత్త సేకరించే ఆటో డ్రైవర్​ మద్యం మత్తులో వాహనం నడిపి రెండు బైక్​‌లను, మరో రెండు కార్లను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

ఈ ఘటన మేడ్చల్​ జిల్లా మేడిపల్లి పీఎస్​ పరిధిలో చెంగిచెర్లలో చోటు చేసుకుంది. ఈ దృశ్యాలన్ని సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని చికిత్స నిమిత్తం కోసం క్షతగాత్రులను గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి కారణమైన జీహెచ్​ఎంసీ చెత్త ఆటో డ్రైవర్‌​ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులో అతి వేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారి పరిస్థితి విషంగా ఉందని పోలీసులు చెప్పారు. ‌ఆటో‌డ్రైవర్‌​ను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపించామన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+