విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో గుడ్‌న్యూస్: సరికొత్త స్టూడెంట్ పాస్ ‘స్మార్ట్ కార్డ్’
హైదరాబాద్: నగరంలోని విద్యార్థులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. జులై 1వ తేదీ నుంచి మెట్రో రైలులో స్టూడెంట్ పాస్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రకటించింది. 20 ట్రిప్పుల ఛార్జీతో నగరంలోని ఏ ప్రాంతం నుంచైనా ఏ ప్రాంతానికైనా 30 ట్రిప్పులు ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. దీని వ్యాలిడిటీ 30 రోజులుగా నిర్ణయించింది. ఇందుకోసం
విద్యార్థులు కొత్త స్మార్ట్ కార్డును తీసుకోవాలని సూచించింది.
ఈ స్మార్ట్ కార్డులను జేఎన్టీయూ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, విక్టోరియా మెమోరియల్, దిల్‌సుఖ్‌నగర్, నారాయణగూడ, నాగోల్, పరేడ్ గ్రౌండ్స్, బేగంపేట, రాయదుర్గ్ మెట్రో స్టేషన్లలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య తీసుకోవచ్చని తెలిపింది. కాగా, ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్ 9 నెలలపాటు అందుబాటులో ఉంటుంది.

2023 జూలై 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఈ స్టూడెంట్ పాస్ ఆఫర్‌ను విద్యార్ధులు వినియోగించుకోవచ్చని హైదరాబాద్ మెట్రో తెలిపింది. ఒక్కో విద్యార్థికి ఒక స్మార్ట్ కార్డ్ మాత్రమే జారీ చేయబడుతుందని స్పష్టం చేసింది మెట్రో సంస్థ. 1998, ఏప్రిల్ 1 తర్వాత జన్మించిన విద్యార్ధులు ఈ పాస్‌కు అర్హులని తెలిపింది. కాగా, విద్యార్ధులు ఈ ఆఫర్ సద్వినియోగం చేసుకోవాలని మెట్రో సంస్థ ఎండీ సూచించారు.
'మెట్రో స్టూడెంట్ పాస్‌ని పరిచయం చేస్తున్నాము. హైదరాబాదీ విద్యార్థులకు మెట్రో మార్గంలో ప్రయాణించడానికి అంతిమ, అనుకూలమైన సాధనం.మీ కళాశాల ఐడీ కార్డ్‌ని చూపడం ద్వారా సరికొత్త స్టూడెంట్ పాస్ మెట్రో కార్డ్‌ను పొందండి, 20 రైడ్‌లకు రీఛార్జ్ చేయండి.. 30 రోజుల్లో 30 రైడ్‌లను పొందండి.

హైదరాబాద్ మెట్రోతో పాఠశాల/కళాశాలకు వెళ్లడం గతంలో కంటే ఇప్పుడు సులభతరం చేయబడింది. స్టూడెంట్ పాస్ ఆఫర్ 9 నెలల వ్యవధిలో అమలు చేయబడుతుంది, అంటే 1 జూలై 2023 నుంచి 31 మార్చి 2024 వరకు. మీ స్టూడెంట్ పాస్ ఆఫర్‌ని ఇప్పుడే పొందండి!' అని హైదరాబాద్ మెట్రో స్పష్టం చేసింది.
Introducing the Metro Student Pass.
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) July 1, 2023
An ultimate and convenient tool for Hyderabadi Students to ride the metro way.
Get a brand new student pass metro card by showing your college ID card, recharge for 20 rides, and get 30 rides in 30 days. School/college-going is now made easier… pic.twitter.com/rHjDhQGPqU
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications