Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్.. గ్రీన్ ఫీల్డ్ హైవే స్పీడప్, ఆ ప్రాంతాలకు మహర్దశ!

కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రవాణా సౌకర్యాలను మెరుగుపరచడానికి శతవిధాల కృషి చేస్తోంది. ఈ క్రమంలోనే భారత్ మాల పరియోజన లో భాగంగా 12 వేల కోట్ల రూపాయల అంచనా వ్యయంతో హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ పనులు మొదలు పెట్టింది. ప్రస్తుతం కర్ణాటకలోని బాగల్ కోట్ జిల్లా ఐహోళే సమీపంలో హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ ఈసీ 10 పనులు కొనసాగుతున్నాయి.

మూడు రాష్ట్రాలను కలుపుతూ హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్
ఈ ప్రాజెక్ట్ తెలంగాణ, కర్ణాటక, గోవా రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ ఈ ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నాలుగు లైన్ల ఎక్స్ప్రెస్ హైవే ను నిర్మిస్తోంది. ఈ ప్రాజెక్టులో బెల్గావి - రాయచూర్ ఎక్స్ప్రెస్ గ్రీన్ఫీల్డ్ హైవే అత్యంత కీలకమైన భాగం.

Hyderabad-Panaji economic corridor speed up greenfield highway development in those regions

బాగల్ కోట్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ హైవే
ఎన్ హెచ్ 748 ఏ లో భాగంగా నిర్మిస్తున్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పూర్తిగా కొత్త మార్గం కావడంతో, పాత రోడ్లతో ఎటువంటి సంబంధం లేకుండా దీనిని రూపొందిస్తున్నారు. బాగల్కోట్ జిల్లాలో 102 కిలోమీటర్ల మేర సాగే ఈ రహదారి కోసం ఇప్పటికే 90 శాతం భూసేకరణ పూర్తికాగా, పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

కర్ణాటక బాగల్ కోట్ లో మొదలైన నిర్మాణ పనులు
బాగల్కోట్ జిల్లాలో 9 మెయిన్ ఫ్లై ఓవర్లను ఈ మార్గంలో భాగంగా నిర్మిస్తారు. కర్ణాటక రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును నాలుగు భాగాలుగా విభజించి, మూడు, నాలుగు ప్యాకేజీల కింద, బాగల్కోట్ లో సుమారు 645 హెక్టార్ల స్థలాన్ని సేకరించి నిర్మాణ పనులను మొదలుపెట్టారు. ఈ ఎక్స్ప్రెస్ వే కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడం మాత్రమే కాదు మూడు రాష్ట్రాల ఆర్థిక ముఖచిత్రాన్ని సమూలంగా మార్చనుంది.

గ్రీన్ ఫీల్డ్ హైవేతో పారిశ్రామిక ప్రగతి
ఈ మార్గం పారిశ్రామిక ప్రగతికి బాటలు వేస్తుంది. ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే తో అనుసంధానం అవుతున్న హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్ ద్వారా గోవాలో ఫిషింగ్, ఫార్మా రంగాలు, బెల్గావిలోని ఆహార ధాన్యాలు, రాయచూర్ లోని వ్యవసాయం, హైదరాబాద్లోని ఐటీ ఫార్మా రంగాలను అనుసంధానం చేస్తారు. దీంతో సిమెంట్, ఖనిజాలు, పత్తి, పండ్లు, చెరకు వంటి ఉత్పత్తుల రవాణా కూడా సులభతరం అవుతుంది.

ఈ ప్రాజక్ట్ తో ఉపాధి, రెండేళ్లలో పూర్తికి టార్గెట్
ఈ మార్గం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది. ఇది స్థానిక ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తుంది. అయితే రానున్న రెండేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోగా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే టార్గెట్ ను రీచ్ అయ్యి తీరాలని కేంద్రం అధికారులకు ఆదేశాలను జారీ చేసింది

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+