Air India: హైదరాబాద్ ఎయిరిండియా ఫ్లైట్ హార్డ్ ల్యాండింగ్..! ఏం జరిగిందంటే ?
హైదరాబాద్ (hyderabad) నుంచి థాయ్ లాండ్ లోని ఫుకెట్ విమానాశ్రయానికి వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ 737 బోయింగ్ విమానం (air india) ఇవాళ అత్యవసరంగా హార్డ్ ల్యాండ్ అయింది. ఫుకెట్ విమానాశ్రయంలో రన్ వేపై నోస్-వీల్ సమస్య తలెత్తడంతో ఈ విమానాన్ని పైలట్లు హార్ట్ ల్యాండింగ్ చేశారు. దీంతో ఈ విమానంలో ప్రయాణిస్తున్న 133 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది భయభ్రాంతులయ్యారు. చివరికి వారంతా ఎలాంటి ప్రమాదం లేకుండా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఇవాళ థాయిలాండ్ లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం హార్డ్ ల్యాండింగ్ చేయడం వల్ల దాని ల్యాండింగ్ గేర్ దెబ్బతింది. అలాగే రన్ వే కూడా దెబ్బతిని విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. ఇవాళ మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్-ఫుకెట్ మార్గంలో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ బోయింగ్ 737 మ్యాక్స్ 8 రన్‌వేపై సమస్య ఎదుర్కొంది. VT-BWQ రిజిస్ట్రేషన్ కలిగిన ఈ విమానంలో చక్రం విడిపోయింది. దీనికి హార్డ్ ల్యాండింగే కారణమని ప్రాథమికంగా తేలింది.

ప్రాథమిక తనిఖీల్లో ఎయిరిండియా విమానం నోస్ ల్యాండింగ్ గేర్ దెబ్బతిన్నట్లు తేలింది. దీని వలన విమానం వెంటనే రన్‌వే నుండి ముందుకు కదలదు. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది సహా 131 మంది ప్రయాణికులు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మొత్తం 133 మంది ప్రయాణికులను సురక్షితంగా దింపి వేచి ఉండే ప్రాంతానికి తరలించారు. వీరిలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. తమ సిబ్బంది అన్ని ప్రామాణిక ప్రోటోకాల్‌లను పాటించారన, అతిథులను విమానం నుండి దింపారని ఎయిరిండియా తెలిపింది. మా అతిథులు, ఫుకెట్ విమానాశ్రయ అధికారులు, అందరి సహకారానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.












Click it and Unblock the Notifications