అడ్డంగా బుక్ అయిన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి

Vijay Devarakonda: అక్రమ బెట్టింగ్ యాప్స్ విషయంలో హైదరాబాద్ పోలీసులు సంచలన నిర్ణయాలను తీసుకున్నారు. దీన్ని ప్రోత్సహించిన ప్రతి ఒక్కరి మీదా కేసులు నమోదవుతున్నాయి. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు మాత్రమే కాదు.. బిగ్ సెలెబ్రెటీలను కూడా వదలట్లేదు. వాళ్లపై ఎఫ్ఐఆర్‌ను ఫైల్ చేస్తోన్నారు.

మరోసారి హైదరాబాద్ పోలీసులు కొరడా ఝుళిపించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేశారనే కారణంతో రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌పై మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదైంది. వారితో పాటు మొత్తంగా 25 మంది సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లపై మియాపూర్ పోలీసులు కేసులు పెట్టారు.

Mancu Lakshmi

బెట్టింగ్ యాప్‌లు, వాటికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తోన్నారనే కారణంతో ఫణీంద్ర శర్మ అనే 32 సంవత్సరాల ఓ బిజినెస్‌మెన్.. మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. త్వరలో వారికి నోటీసులు అందజేసే అవకాశం ఉంది.

కొంతకాలంగా హైదరాబాద్ సహా తెలంగాణలో అన్ని ప్రాంతాలు, జిల్లా కేంద్రాల్లో బెట్టింగ్‌లపై నిఘా వేశారు పోలీసులు. ఐపీఎల్ 2025 సీజన్ కూడా సమీపించిన నేపథ్యంలో బెట్టింగ్‌లపై తమ నిఘా ముమ్మరం చేశారు. దాడులు తీవ్రతరం చేశారు. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్‌గా పని చేస్తోన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్.. ఓ ఉద్యమంలా దీన్ని తెర మీదికి తీసుకొచ్చారు.

#SayNoToBettingApps అనే హ్యాష్‌ట్యాగ్‌ను సైతం సజ్జనార్ క్రియేట్ చేశారు. ఎక్స్, యూట్యూబ్, ఫేస్‌బుక్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపై దాన్ని వైరల్ చేశారు. జీవితాలను కబళించే ఆన్‌లైన్‌ గేమ్స్‌ జోలికి వెళ్లవద్దంటూ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా యూజర్లను ఆయన అప్రమత్తం చేస్తూనే వస్తోన్నారు.

ఆకర్షణీయమైన వెల్‌కమ్‌ ఆఫర్లు, ఫ్రీ రివార్డ్స్‌ పేరిట వలవేసి సర్వం దోచేస్తారంటూ ఆందోళన వ్యక్తం చేశారు సజ్జనార్. రమ్మీ సర్కిల్, ఆన్‌లైన్‌ కార్డ్‌ గేమ్స్‌ వంటి యాప్స్‌ను డౌన్‌లోడ్‌ చేయకూడదని, జీవితాన్ని ఆన్‌లైన్‌ గేమ్స్‌కు తాకట్టు పెట్టొద్దని, అత్యాశను ఆసరాగా చేసుకుని ఖాతాలను ఖాళీ చేస్తారంటూ హెచ్చరించారు.

బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేస్తోన్న కొందరు యూట్యూబర్లపై కేసులు నమోదు అయ్యేలా చేశారు. ఈ క్రమంలోనే హర్షసాయి వంటి యూటూబర్లపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇప్పుడు ఇది మరింత విస్తరించింది. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, ప్రకాష్ రాజ్‌‌పై సైతం కేసులు నమోదుకు దారి తీసింది.

వాళ్లపై భారత్ న్యాయ సంహిత లోని సెక్షన్లు 318 (4), 112, ఆర్/డబ్ల్యూ 49, ఐటీ యాక్ట్‌లోని 3, 3 (ఏ), టీఎస్‌జీఏలోని 66-డీ కింద ఎఫ్ఐఆర్ నంబర్ 393/2025 రికార్డయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+