యాంకర్ ప్రదీప్‌ను వదిలేయమన్న యువతికి దిమ్మతిరిగే షాకిచ్చిన హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్: డిసెంబర్ 31వ తేదీన మోతాదుకు మించి మద్యం మత్తులో పట్టుబడిన యాంకర్ ప్రదీప్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడం లేదు. ఆయన పోలీసులకు చిక్కడం లేదు. అయితే, సోషల్ మీడియాలో హైదరాబాద్ పోలీసులు పెట్టిన ఒక పోస్టుకి ఓ అమ్మాయి ప్రదీప్‌ను వదిలేయమని చెప్పింది.
Recommended Video

దీనికి హైదరాబాదు పోలీసులు అదిరిపోయే సమాధానం చెప్పారు. న్యూఇయర్ సందర్భంగా 1683 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు రిజిస్టర్ అయ్యాయని హైదరాబాద్ పోలీసులు పోస్టు పెట్టారు. ఆ పోస్టుకు హానీ భవాని అనే అమ్మాయి ఓ విజ్ఞప్తి చేసింది.

మా ప్రదీప్‌ను వదిలేయమంటే గట్టి కౌంటర్
సార్, ప్లీజ్ మా యాంకర్ ప్రదీప్‌ను వదిలేయండి, పాపం చిన్నపిల్లవాడు, తెలియక చేశాడని ఆమె విజ్ఞప్తి చేసింది. దానికి హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గట్టి సమాధానం చెప్పారు. ఎవరినీ అగౌరవపరచవద్దని, చిన్నపిల్లలు అయితే పాలు తాగి పడుకోవాలి కాని, మందు తాగి నడపడం కరెక్టు కాదు కదా, సెలబ్రిటీలు అందరికీ ఆదర్శంగా ఉండాలి అని, అడ్మిన్ హెచ్ పేరుతో సమాధానం ఇచ్చారు.

అంతుబట్టని ప్రదీప్ వ్యవహారం
ఇదిలా ఉండగా, యాంకర్ ప్రదీప్ వ్యవహారం అంతుబట్టడం లేదు. కౌన్సెలింగ్‌కు ఆయన హాజరు కాలేదు. మంగళవారం కౌన్సెలింగ్ కేంద్రానికి రావాలని ట్రాఫిక్ పోలీసులు ఆయనను ఆదేశించారు. మంగళ, బుధ వారాలు ఎదురు చూశారు. రాలేదు. గురువారం కూడా అదే పరిస్థితి.

వరుసగా డుమ్మాలు
ప్రదీప్ శుక్రవారం కూడా కౌన్సెలింగ్‌కు హాజరు కాకుంటే ఛార్జీషీట్ దాఖలు చేసి వారెంట్ జారీ చేయనున్నారు. ప్రదీప్‌ను కోర్టులో ప్రవేశ పెడతారు. కోర్టు కూడా కౌన్సెలింగ్ ఇవ్వమని చెబుతుందని అంటున్నారు. అసలు ప్రదీప్ వస్తాడా, రాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఫాంహౌస్‌లో ప్రదీప్
ప్రదీప్ ఈ కేసు నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఓ ప్రముఖ వ్యక్తి ద్వారా బయటపడేందుకు చూస్తున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అతని కోసం ఇంట్లో, కార్యాలయంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. అతను మణికొండలోని ఓ ఫాంహౌస్‌లో ఉన్నట్లు గుర్తించారని సమాచారం.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications