స్పా పేరిట సెక్స్ రాకెట్: యువతీయువకుల అరెస్ట్: ఎస్ఐ లైంగిక వేధింపులు?
హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12లోని ఖరీదైన ఓ అపార్ట్‌మెంట్‌లో మసాజ్ సెంటర్ పేరుతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్న ముఠా ఆట కట్టించారు వెస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు. నిందితులైన యువతి, యువకులను అదుపులోకి తీసుకున్నారు.

స్పా పేరిట సెక్స్ రాకెట్..
బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం.. మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం అందుకున్న బంజారాహిల్స్ డీఐ రవికుమార్ నేతృత్వంలో ఎస్సై రాంరెడ్డి సిబ్బందితో కలిసి బంజారాహిల్స్ రోడ్డు12లో ఓ కాంప్లెక్స్‌లో రెండో అంతస్తులోని 205 ఫ్లాట్‌లో ఉన్న ‘స్టూడియో మేకర్స్ స్పా' కేంద్రంపై దాడి చేశారు.

యువతీయువకుల అరెస్ట్
స్పాలో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు. అక్కడే ఉన్న ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. ముగ్గురు యువతు(19)లను అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరాది యువతులతో..
స్పా నిర్వాహకులు సతీష్ అలియాస్ శరణప్ప అలియాస్ హరినాథ్ అలియాస్ హరి ఉత్తరాది నుంచి యువతులను తీసుకొచ్చి వ్యభిచార కార్యకలాపాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. నిందితులందర్నీ అరెస్ట్ చేశారు.

లైంగికంగా వేధించిన ఎస్ఐ?
కాగా, స్పాలో పట్టుబడిన యువతిపై టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. ఈ స్పాలో ముగ్గురు యువతులను పట్టుకోగా వారిలో ఒక యువతిని టాస్క్‌ఫోర్స్ ఎస్సై గదిలోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చాయి. గురువారం ఆ యువతి ఎస్సైపై ఆరోపణలు చేయడంతో పోలీసులు ఈ విషయంపై విచారణ చేపట్టారు. దీనిపై పశ్చిమ మండల అధికారి మాట్లాడుతూ ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు.
-
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications