Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

'బిర్యానీ క్యాపిటల్' గా హైదరాబాద్.. కోటీ 75 లక్షల ఆర్డర్లు..

హైదరాబాద్ బిర్యానీని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ బిర్యానీ తినకుండా వెళ్లరు. నగరంలోని ప్రతి హోటల్ లో బిర్యానీ ఫేవరెట్ డిష్ గా ఉంటుంది. నిజాం నవాబుల దగ్గర్నుంచి హైదరాబాదీ బిర్యానీకి ఎంతో చరిత్ర ఉంది. హైదరాబాద్ బిర్యానీకి జియో ట్యాగ్ కోసం కూడా ప్రభుత్వాలు ప్రయత్నం చేశాయి. ప్రస్తుతం ఈ అంశం పెండింగ్ లో ఉంది. అయితే తాజాగా మరోసారి బిర్యానీ క్యాపిటల్ గా హైదరాబాద్ నిలిచింది. ఈ మేరకు దేశంలోనే బిర్యానీ రాజధానిగా హైదరాబాద్ నిలవడం విశేషం.

తెలంగాణ రాజధాని హైదరాబాద్ అరుదైన ఘనత సాధించింది. దేశంలోనే బిర్యానీ క్యాపిటల్ గా భాగ్యనగరం నిలిచింది. గతేడాది ఏకంగా 1.75 కోట్ల బిర్యానీలు ఆర్డర్ అయ్యాయి. అది కూడా ఒకే ఫుడ్ డెలివరీ యాప్ కావడం విశేషం. అవును.. స్విగ్గీ ఫుడ్ డెలివరీ యాప్ ద్వారా 2025 లో ఏకంగా కోటీ 75 లక్షల బిర్యానీ ఆర్డర్లు నమోదయ్యాయి. ఈ విషయాన్ని స్విగ్గీ వార్షిక రిపోర్టులో వెల్లడించింది.

అలాగే దేశవ్యాప్తంగా ఆర్డర్‌ చేసిన బిర్యానీలలో ఇది దాదాపు 18 శాతం కావడం గమనార్హం. బిర్యానీలో చికెన్ బిర్యానీని కోటీ 8 లక్షల ఆర్డర్లు వచ్చాయి. అంటే బిర్యానీ మొత్తం ఆర్డర్లలో ఇది 61 శాతంగా ఉంది. ఇక బిర్యానీ తర్వాత అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటెమ్ లో వెజ్ దోశ ఉంది. వెజ్‌ దోశకు మొత్తం 39.9 లక్షలు ఆర్డర్లు వచ్చాయి. ఇక మూడో స్థానంలో ఇడ్లీ ఉంది. ఇడ్లీకు 34 లక్షల ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ తన రిపోర్టులో పేర్కొంది.

Hyderabad Reigns Supreme 17 5 Million Biryanis Ordered on Swiggy in 2025 Undisputed Biryani Capital

అలాగే బోంది లడ్డూకు 3.3 లక్షల ఆర్డర్లు, ఆ తర్వాతి స్థానాల్లో చాకోలెట్, గులాబ్ జామ్ ఉన్నాయి. ఈవెనింగ్ స్నాక్స్ లో చికెన్ బర్గర్ కు 6.8 లక్షల ఆర్డర్లు లభించాయి. ఆ తర్వాతి స్థానాల్లో చికెన్ ఫ్రై, చికెన్ షావర్మా, వెజిటేరియన్ పిజ్జా, వెజిటేరియన్ పఫ్ లు ఉన్నాయి. ఇక రాత్రి సమయంలో చికెన్ బిర్యానీ టాప్ ప్లేస్ లో ఉంది. ఆ తర్వాత చికెన్‌ బర్గర్‌, చికెన్‌ షావర్మ ఉన్నాయి. ఇక స్విగ్గీ ద్వారా అత్యధిక ఆదాయం అందుకున్న నగరాల్లో హైదరాబాద్ నగరం మూడో స్థానంలో ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+