ఏంటీ.. హైదరాబాద్ లోని ఈ ప్రాంతాల్లో ఇంటి అద్దె ఇంత చీపా..?
హైదరాబాద్.. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 68వ స్థానంలో ఉంది. సంపన్న నగరాల జాబితాలో 65 వ స్థానంలో కొనసాగుతోంది. ఇక స్టార్టప్ సంస్థలకు అనుకూలమైన నగరాల్లో ప్రపంచంలోనే 19వ స్థానంలో ఉంది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతూనే ఉంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలకు పైగానే ఉంది. 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. ఈ లెక్కన ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది.
ఉపాధి, ఉద్యోగం, చదువులు, కోచింగ్ లు, వ్యాపారం.. ఇలా అనేక పనుల కోసం నిత్యం వేలాది మంది ప్రజలు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వస్తుంటారు. అయితే హైదరాబాద్ లో ఇంటి అద్దెలకు రెక్కలు వచ్చినట్లుగా పెరిగిపోతున్నాయి. భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ పెరిగిన నేపథ్యంలో ఇంటి అద్దెలు కూడా భారీగా పెరిగిపోయాయి. అయితే హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటి అద్దెలు చాలా తక్కువగానే ఉన్నాయి.
హైదరాబాద్‌లో మీకు రూ. 3,000 నుండి మొదలుకొని 10వేలకు మంచి సౌకర్యాలతో ఇళ్లు లభించే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా ఓల్డ్ సిటీ, సంతోష్ నగర్ చంద్రాయణగుట్టతో పాటు చార్మినార్ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు హైదరాబాద్ లోనే అత్యంత సరసమైన ధరలలో ఇల్లు లభిస్తోంది. ఈ ప్రాంతాల్లో కేవలం రూ. 3,000 నుండి రూ. 7,000 మధ్యే అద్దెకు ఇల్లు లభిస్తోంది. అయితే ఈ ప్రాంతాల్లో కొంత నీటి కొరత ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఉప్పల్, మియాపూర్ , అమీర్‌పేట్ ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటాయి. ఉప్పల్, నాగోల్ ప్రాంతాల్లో అద్దె ఇల్ల ధరలు సాధారణంగా రూ. 6,000 నుండి రూ. 10,000 మధ్య ఉంటాయి.

అలాగే హైటెక్ సిటీకి సమీపంలో.. మియాపూర్ ప్రాంతంలో విశాలమైన 2BHK, 3BHK గృహాలు రూ. 8,000 నుండి రూ. 12,000 మధ్య లభ్యం అవుతున్నాయి. ఇక్కడి నుంచి ఐటీ హబ్ కేవలం 15-20 నిమిషాల ప్రయాణ దూరంలోనే ఉంది. ఇక అమీర్ పేట్ ప్రాంతంలో నెలవారీ అద్దెలు సాధారణంగా రూ. 4,000 నుండి రూ. 7,000 వరకు ఉంటాయి. అలాగే సికింద్రాబాద్ సమీపంలోని ECIL , కుషాయిగూడ ప్రాంతాల్లో అయితే ఇంటి అద్దెలు రూ. 10,000 నుండి రూ. 12,000 మధ్య ఉన్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications