11 లక్షల మంది మహిళలకు బతుకమ్మ కానుక.. ఆ రోజు నుంచే ప్రారంభం..!

దసరా, బతుకమ్మ ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఎన్నడూ లేని విధంగా ఈసారి దసరా, బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రేవంత్ ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ సంబరాల్లో భాగంగా నగరంలోని 11 లక్షల మందికి బతుకమ్మ కానుక ఇవ్వనుంది. అలాగే గిన్నిస్ రికార్డు లక్ష్యంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించాలని ప్రణాళికలు రెడీ చేసింది.

తెలంగాణలో బతుకమ్మ పండగ ఏటా మహాలయ అమావాస్య రోజున ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది. చివరి రోజును "సద్దుల బతుకమ్మ" లేదా "పెద్ద బతుకమ్మ" అని పిలుస్తారు. దుర్గాదేవికి, ప్రకృతిని ఆరాధించడానికి ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ సారి బతుకమ్మ పండుగను కార్నివాల్ తరహాలో నిర్వహించాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కరపత్రాలను సైతం విడుదల చేసింది. అయితే ఈ సారి ఏకంగా 11 లక్షల మందికి దసరా పండుగ కానుక ఇచ్చేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. ఈ సంవత్సరం నిర్వహించబోయే బతుకమ్మ ఉత్సవాలను గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేస్తోంది.

Hyderabad s Bathukamma Bonanza Sarees for 11 Lakh Women Guinness Record in Sight

ఎన్నడూలేని విధంగా ఈసారి ఏకంగా 11 లక్షల మందితో బతుకమ్మ సంబరాలు నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ఉత్సవాల్లో పాల్గొన్న మహిళలందరికీ బతుకమ్మ చీరలను కూడా పంపిణీ చేయనున్నారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 11 లక్షల మంది స్వయం సహాయక సభ్యులకు పంపిణీ చేయడం కోసం సర్కార్ 11 లక్షల బతుకమ్మ చీరలను కేటాయించనుంది. ఇక ఈ ఏడాది బతుకమ్మ పండుగను ఈ నెల 21 నుంచి 30 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ సారి కార్నివాల్ తరహాలో బతుకమ్మ పండుగను నిర్వహించాలని నిర్ణయించినట్లు పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.

బతుకమ్మ ఉత్సవాలు వరంగల్ లోని వేయి స్తంభాల గుడి వద్ద ఈనెల 21 న ప్రారంభం కానున్నాయి. అలాగే సెప్టెంబర్ 27 న సాయంత్రం ట్యాంక్ బండ్ వద్ద బతుకమ్మ కార్నివాల్, 29న పీపుల్స్ ప్లాజా వద్ద ఉత్తమ బతుకమ్మ పోటీ, 29న ఐటీ రంగం ఉద్యోగులు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ల పోటీ, 30న ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ పూల పండగ నిర్వహణ ఉంటాయని అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+