హైదరాబాద్ కు మహార్దశ.. 6 స్కై వాక్స్ కు రంగం సిద్ధం.. ఈ ప్రాంతాల్లోనే..

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో పట్టణ జనాభా రోజురోజుకూ పెరిగిపోతుంది. భాగ్యనగరంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. ట్రాఫిక్ లోనే గంటల కొద్దీ వాహనాలు నిలిచిపోతున్నాయి. రోడ్లన్నీ రద్దీగా మారిపోతున్నాయి. దీంతో రోడ్డు పక్కన నడిచే పాద చారులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇక రద్దీ ప్రాంతాల్లో అయితే అడుగు తీసి అడుగు వేయడం నరకంగా మారుతోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాల్లో పాద చారులు, మహిళలు, చిన్నారులు సులువుగా నడుచుకుంటూ వెళ్లేందుకు స్కై వాక్స్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

గ్రేటర్ హైదరాబాద్ లోని 6 రద్దీ ప్రాంతాల్లో 6 స్కై వాక్స్ ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విధానం ద్వారా ట్రాఫిక్ ను తగ్గించడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలను కూడా నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో నగరంలోని అఫ్జల్ గంజ్, మదీనా, లక్డీ-కా-పూల్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ, మియాపూర్ టీ- జంక్షన్ లో స్కై వాక్స్ ను నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందించాలని హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ ఆథారిటీ(HMDA) కు ఆదేశాలు జారీ చేసింది.

హైదరాబాద్ లోని ఈ ఆరు ప్రాంతాలు నిత్యం రద్దీగా ఉంటున్నట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఈ ప్రాంతాల్లో పాద చారులు రద్దీ రోడ్లపై నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నట్లు తేల్చారు. ఇదే ప్రాంతాల్లో ట్రాఫిక్, రద్దీ కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అందువల్ల ఈ ప్రాంతాల్లో స్కై వాక్స్ నిర్మిస్తే పాద చారులు సులభంగా రోడ్డు దాటడం ఉంటుందని రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చని అధికారులు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఉప్పల్ స్కై వాక్.. కు విశేష స్పందన వచ్చింది. ఈ స్కై వాక్ ను నగర ప్రజలు అద్భుతంగా వినియోగించుకుంటున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది.

Hyderabad Skywalks State Government Plans New Pedestrian Bridges at Key Junctions

ఇక మెహదీపట్నం వద్ద కూడా ఓ స్కై వాక్ ను నిర్మిస్తున్నారు. అలాగే సికింద్రాబాద్ లోని రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, మెట్రో స్టేషన్ కు కలుపుతూ మరొక స్కై వాక్ నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు. మరోవైపు లీ అసోసియేట్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ లోని 23 రద్దీ ప్రాంతాల్లో స్కై వాక్స్ అవసరం అని నివేదించింది. ఈ క్రమంలో తొలుత ఈ ఆరు ప్రాంతాల్లో స్కై వాక్స్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+