బాలీవుడ్ షోలో హైదరబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ..
కేడెన్ శర్మ.. ప్రస్తుతం ఈ పేరు యూటూబ్‌లో సంచనలం సృష్టిస్తోంది.. హైదరాబాద్ షెహర్ కా మే స్ట్రీట్ సెలబ్రిటీ అంటూ ఓ సరికొత్త పాటతో బాలీవుడ్ షోలో అదరగొట్టేశాడు మన తెలుగు కుర్రాడు.. ఎమ్‌టీవిలో ప్రసారమయ్యే ఓ రియాలిటి షోలో కేడెన్ పాడిన ఈ పాట ప్రస్తుత్తం నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఈ షోలో కేడెన్ హైదరాబాద్ నగరంగా గురించి ఓ ర్యాప్‌ను పాడారు. ఈ ర్యాప్‌తో రెండుమూడు రోజుల్లోని ఊహించని రీతిలో పాపులారీటిని సొంతం చేసుకున్నాడు కేడెన్..
ఎమ్‌టివి షోలో: ఎమ్‌టివీలో హజల్ 3 అనే ర్యాప్ సాంగ్స్ రియాలీ షో నడుస్తోంది. కొద్ది రోజుల క్రితం ఈ షోలో హైదరాబాద్ కుర్రాడు కేడెన్ శర్మ కంటెండర్ షిప్ కోసం పాడిన హైదరాబాద్ స్ట్రీట్ సెలబ్రిటీ సాంగ్ ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఈ ర్యాప్‌లో పుష్ప సినిమాతో అల్లుఅర్జున్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశాడో వివరిస్తాడు. అంతేకాదు హైదరబాద్ నగరంగా ఎంతో అందంగా ఉంటుందో ఈ పాట రూపంలో చెబుతాడు. ఈ పాట మొత్తం ఓల్డ్ సిటి స్లాంగ్‌లోనే ఉంటుంది.

తనే సొంతంగా లిరిక్స్ రాసుకుని ఈ ర్యాప్‌ను పాడాడు కేడెన్. ఈ ర్యాప్‌లో వల్గారిటి లేకుండా సాయిపల్లవి ఎలా సినిమాలు చేస్తుందో కూడా వివరించాడు. పుష్ప సినిమా గురించి కూడా ఈ ర్యాప్‌లో చెబుతాడు. ఇంకా ఈ పాటలో హైదరాబాద్ గొప్పతనం గురించి కూడా వివరిస్తాడు. హైదరాబాద్ బిర్యాని, ఛాయ్, రామోజీ ఫిల్మ్‌సిటి గురించి కూడా ఇందులో ఉంటుంది.
హైదరాబాద్ గొప్పతనం వివరించాడు: ఇలా ఒక్కటేమిటీ మొత్తం హైదరాబాద్‌నే తన పాటలో చూపించాడు ఈ కుర్రాడు. బాలీవుడ్ సినిమాల నిర్మాణానికి అడ్డాగా నిలుస్తున్న రామోజీ ఫిలింసిటీ, ఆస్కార్ విజేతగా నిలిచిన RRR నాటు నాటు పాట గురించి, హైదరాబాదీ స్పెషల్ బిర్యానీ, ఇరానీ ఛాయ్, ఛార్మినార్‌లో దొరికే చిన్న చిన్న వస్తువులు, దుకాణాలు, అక్కడ ప్రజలు ఆడే బేరాలు అన్నింటిని ఆ పాటలో చెప్పాడు. ముఖ్యంగా హైదరాబాద్ కల్చర్, సిగ్నిఫికెన్స్, సినిమాలు, అక్కడి ఫుడ్ దేశవ్యాప్తంగా ఎంత ఫేమస్ అవుతున్నాయో ర్యాప్ చేసి వినిపించాడు కేడెన్. ఈ కుర్రాడు చూపించిన ప్రతిభకు ఆ రియాలిటి షో విజేతలు ఎంతగానో ఇంప్రెస్ అయ్యారు. ఆ షో జడ్జ్ బాద్షా కేడెన్‌ను కంటెండర్‌గా సెలక్ట్ చేశారు.
ధూల్‌పేట వాసి: కేడెన్ శర్మ హైదరాబాద్‌లోని ధూల్‌పేటకు చెందినవాడు. 2019లో తన పేరుమీద ఒక యూట్యూబ్ ఛానల్‌ను ప్రారంభించాడు. తనే స్వయంగా రాసుకున్న పాటలను ర్యాప్ పాడేవాడు. ఆ ర్యాప్స్‌ను తన ఛానెల్‌లో అప్లోడ్ చేయడం వంటివి చేసేవాడు. అయితే, ఇప్పడు ఏకంగా ఎమ్‌టివిలో వచ్చే ఒక రియాలీటి షోలో పాల్గొంటున్నాడు. 23 యేళ్ల ఈ కుర్రాడు పడ్డ కష్టానికి ఇప్పడు ఫలితం దక్కిందని చాలామంది నెటిజన్లు అంటున్నారు.












Click it and Unblock the Notifications