హైదరాబాద్ లోనే ఎత్తయిన భవనం.. ఈ ప్రాంతంలోనే నిర్మాణం..

హైదరాబాద్ మహానగరం రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. విశ్వ నగరంగా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచంలోని మహా నగరాల్లో ప్రస్తుతం 41వ స్థానంలో ఉంది. మెట్రో పాలిటన్ సిటీగా అభివృద్ధి చెందింది. భాగ్యనగరంలో జనాభా రోజు రోజుకూ పెరిగిపోతోంది. 2025 లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంత జనాభా కోటీ 13 లక్షల 30 వేలుగా ఉంది. గతేడాదితో అంటే 2024 తో పోలిస్తే 2.43 శాతం పెరుగుదల కనిపించింది. అంటే ఏటా దాదాపు 3 శాతం జనాభా పెరిగిపోతోంది. అలాగే భాగ్యనగరంలో దిగ్గజ కంపెనీలు ఉన్నాయి. ఐటీ, ఫార్మా, బయోసైన్స్ ఇలా అనేక రంగాలకు చెందిన ప్రముఖ కంపెనీలు హైదరాబాద్ లో తమ బ్రాంచ్ లను ఓపెన్ చేసి కార్యకలాపాలు సాగిస్తున్నాయి.

హైదరాబాద్ ఇప్పుడు దేశంలోనే ఐటీ, ఫార్మా, తయారీ హబ్ గా మారింది. ఇక్కడ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్, డెలాయిట్.. తదితర దిగ్గజ ఐటి కంపెనీలతో పాటు.. డాక్టర్ రెడ్డీస్, భారత్ బయోటెక్ వంటి ప్రముఖ ఫార్మా కంపెనీలు కూడా ఉన్నాయి. మాదాపూర్, గచ్చిబౌలి పరిసర ప్రాంతాల్లో హెచ్‌సీఎల్, కాగ్నిజెంట్, టీసీఎస్ లాంటి అనేక కంపెనీలు కార్యకలపాలను సాగిస్తున్నాయి. అటు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం కూడా అభివృద్ధి చెందుతోంది. అలాగే హైదరాబాద్‌ లో ఆకాశమే హద్దుగా భారీ భవనాలు పుట్టుకొస్తున్నాయి.

సాధారణంగా హైదరాబాద్ లోని కోకాపేట ప్రాంతంలో అత్యంత ఎత్తయిన భవనాలకు నిలయంగా ఉండేది. కానీ ఇప్పుడు కోకాపేటను తలదన్నేలా ఘట్ కేసర్ ప్రాంతంలో ఓ భవనం నిర్మాణం జరుగుతోంది. ఘట్‌ కేసర్ శివారులో 72 అంతస్తులతో నగరంలోనే అత్యంత ఎత్తయిన ఆకాశహర్మ్యం నిర్మాణం జరుగుతోంది. ఏకంగా 72 అంతస్తులతో 'డ్యాన్సింగ్ డాఫోడిల్స్' పేరుతో ఈ భారీ భవనాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు కావాల్సిన ప్రాథమిక అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోగా.. అగ్నిమాపక శాఖ నుంచి ఇప్పటికే అనుమతులు లభించాయి.

Hyderabad Tallest Dancing Daffodils 72-Floor Tower Rising at Ghatkesar Skyline Revolution

ఈ ఎత్తయిన భవనం ద్వారా మొత్తం 966 విలాసవంతమైన అపార్టుమెంట్లు అందుబాటులోకి రానున్నాయి. ఇక ఈ భవంతి పేరుకు తగ్గట్టుగానే గాలిలో మెలికలు తిరుగుతూ.. ఒంపులుగా ఉండే విభిన్నమైన నిర్మాణ శైలితో రూపొందనుంది. ఈ భవనం దాదాపు 244.6 మీటర్ల ఎత్తుతో నిర్మాణం కానుంది. కోకాపేటలో ప్రస్తుతం ఉన్న 60 అంతస్తుల భవనమే అత్యంత ఎత్తైనదిగా ఉంది. అయితే ఈ కొత్త ప్రాజెక్టు దానిని తలదన్నేలా ఉండనుంది. ఇక ఈ భవనంలో మొత్తం 966 అపార్టుమెంట్లు ఉండనున్నాయి. అందులో 3BHK ఇళ్లు 692 కాగా.. 4BHK ఇళ్లు 274 గా ఉన్నాయి. ఒక్కసారి ఈ భవనం పూర్తయితే హైదరాబాద్ నగరానికే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+