హైదరాబాద్ నుంచి అరుణాచలం, మధురైకి ఇక రెగ్యులర్ ట్రైన్లు
హైదరాబాద్ ప్రయాణికులకు రైల్వే బోర్డు శుభవార్త వినిపించింది. హైదరాబాద్, కాచిగూడ నుంచి రాకపోకలు సాగించే రెండు ప్రత్యేక/వీక్లీ రైళ్లను క్రమబద్ధీకరించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదనలకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఫలితంగా- తమిళనాడులోని పలు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించాలనుకునే వారికి మరింత మెరుగైన కనెక్టివిటీని కల్పించినట్టయింది.
కాచిగూడ- తూత్తుకూడి
కాచిగూడ నుంచి మధురై వరకు మాత్రమే నడుస్తోన్న ఈ రైలును ఇకపై తూత్తుకూడి (ట్యుటికోరిన్) వరకు పొడిగించారు. బయలుదేరి వెళ్లే 07191/07192 కాచిగూడ-మధరై స్పెషల్ ఎక్స్ ప్రెస్ కు రెగ్యులర్ సర్వీస్ నంబర్ కేటాయించారు. దీని కొత్త నంబర్ 17615/17616 కాచిగూడ-తుత్తుకుడి ఎక్స్‌ప్రెస్‌గా రూపుదిద్దుకుంది. కాచిగూడ- మధురై ప్రత్యేక రైలు సమయాల్లో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాచిగూడ నుండి బయలుదేరే నంబర్ 17615 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు రాత్రి 10:45 నిమిషాలకు తూత్తుకుడికి చేరుకుంటుంది. ప్రతి బుధవారం ఉదయం 7:45 నిమిషాలకు తూత్తుకుడి నుండి బయలుదేరే నంబర్ 17616 ఎక్స్‌ప్రెస్ గురువారం మధ్యాహ్నం 1:25 నిమిషాలకు కాచిగూడకు చేరుకుంటుంది.
షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, అనంతపూరం, ధర్మవరం, కదిరి, మదనపల్లె రోడ్, పీలేరు, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్, తిరువణ్ణామలై (అరుణాచలం), విల్లుపురం, పనృటి, కడలూరు పోర్ట్, చిదంబరం, సర్కాజీ, మైలాడుతురై, కుంభకోణం, పాపనాశం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగల్, మధురై, విరుదునగర్, సత్తూర్, కోవిల్‌పట్టి మీదుగా రాకపోకలు సాగిస్తుంది.
హైదరాబాద్- కన్యాకుమారి
నంబర్ 07229/07230 హైదరాబాద్- కన్యాకుమారి మధ్య రాకపోకలు సాగిస్తోన్న ప్రత్యేక రైలు కూడా రెగ్యులర్ సర్వీస్ అయింది. వీటి నంబర్ 17069/17070గా మారింది. హైదరాబాద్ నుండి ప్రతి బుధవారం సాయంత్రం 5:20 నిమిషాలకు బయలుదేరే నంబర్ 17069 ఎక్స్ ప్రెస్ రెండో రోజు వేకువ జామున 2:30 గంటలకు కన్యాకుమారికి చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో- ప్రతి శుక్రవారం తెల్లవారు జామున 5:15 నిమిషాలకు కన్యాకుమారి నుండి బయలుదేరే నంబర్ 17070 ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది.
సికింద్రాబాద్, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, తిరువణ్ణామలై (అరుణాచలం), విల్లుపురం, తిరుప్పాద్రిప్పులియూరు, చిదంబరం, మైలాడుతురై, కుంభకోణం, తంజావూరు, తిరుచిరాపల్లి, దిండిగల్, కొడైకెనాల్ రోడ్, మధురై, విరుదునగర్, సత్తూర్, కోవిల్‌పట్టి, తిరునల్వేలి, వల్లియూర్, నాగర్‌కోయిల్ మీదుగా ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది.
-
Viral Video: రైల్వే బోగీనా..? లేక బార్ అండ్ రెస్టారెంట్ అనుకున్నారా..? -
హైదరాబాద్ లో 'స్నో వరల్డ్'.. మంచులో ఫుల్ ఎంజాయ్.. తక్కువ ధరకే..! -
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications