మద్యం తాగి పట్టుబడితే ఆఫీసులకు, కాలేజీలకు లేఖలు..!!

మద్యం తాగి వాహనాలు నడిపే వారిపైన కఠిన చర్యలు పోలీసులు సిద్దం అయ్యారు. ఇప్పటికే పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి కారణంగా ప్రమాదాలు పెరగటం తో పోలీసులు కఠిన చర్యలకు సిద్దం అయ్యారు. అందులో భాగంగా మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై హైదరాబాద్‌ సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే పట్టుబడిన వారికి జరిమానాలు, జైలు శిక్ష పడుతున్నాయి. కాగా.. కొత్తగా మరో కీలక నిర్ణయం అమలు దిశగా పోలీసులు కసరత్తు చేస్తున్నారు.

మద్యం తాగి వాహనాలు నడిపే వారి విషయంలో ఇక కఠినంగా వ్యవహరించాలని హైదరాబాద్ పోలీసులు నిర్ణయించారు. పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు జైలుశిక్షలు, జరిమానాలతోనే సరిపెట్టకుండా నిందితుల భవిష్యత్తుపై ప్రభావం పడేలా కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇక నుంచి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారి వివరాలను.. వారు పనిచేసే ఆఫీసులకు, ఒకవేళ విద్యార్థులైతే వారు చదివే విద్యాసంస్థలకు అందించి వారిపై కఠినంగా వ్యవహరించేలా చేయాలని నిర్ణయించారు. ఈ విధంగా చేయటం ద్వారా మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పూర్తిగా తగ్గుతుందని భావిస్తున్నారు. ఎక్కువగా యుక్త వయసులో ఉన్న వారు తనిఖీల్లో బయట పడుతున్నారు. వీరిని ఇక నుంచి మద్యం సేవించి వాహనాలు నడపకుండా నియంత్రించేందుకు వీలుగా ఈ తరహా కఠిన నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తున్నారు.

hyderabad-traffic-police-serious-action-plan-over-drunk-driving-cases-details-here

కాగా, కొత్త ఏడాది వేడుకల్లో మద్యంమత్తులో వాహనాలు నడిపి దొరికిపోయిన మందుబాబులకు న్యాయస్థానం జైలుశిక్ష విధించింది. పోలీసులు ముందుగా హెచ్చరించినట్లుగానే, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో పట్టుబడ్డవారిని జైలుకు తరలించారు. మద్యం మత్తులో వాహనాలు నడిపి ఇతరుల ప్రాణాలు తీసేవారిని 'రోడ్డు టెర్రరిస్టు'లతో పోల్చిన హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌.. మందుబాబులను కట్టడి చేసేందుకు న్యూఇయర్‌ వేళ తనిఖీలు ముమ్మరం చేశారు. గత ఏడాది డిసెంబరు 24 నుంచి 31 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన తనిఖీల్లో సుమారు 1200మందిపై పోలీసులు కేసు నమోదు చేయగా, ప్రస్తుతం 270 మందికి శిక్ష ఖరారైంది. వీరికి ఒకటి నుంచి మూడురోజుల పాటు జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. దీంతో.. మద్యం మత్తులో ఎవరూ వాహనాలు నడపకుండా కఠిన చర్యలు అమలుకు పోలీసు శాఖ సిద్ధమైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+