Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

హైదరాబాద్ కు మహార్దశ.. కొత్తగా 31 ఫ్లై ఓవర్లు, 17 అండర్ పాస్ లు..

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ట్రాఫిక్ రద్దీ కారణంగా నగరవాసులు నిత్యం అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీలో మౌలిక సదుపాయాలు, ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా H-..CITI ప్రణాళిక తీసుకొచ్చింది. ఈ మేరకు బడ్జెట్ ప్రసంగంలో ఈ ప్రణాళికకు సంబంధించిన వివరాలను ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.

నగరంలో 31 ఫ్లైఓవర్లు..

ఈ ప్రాజెక్టులో భాగంగా కొత్తగా 31 ఫ్లై ఓవర్లు నిర్మించనున్నట్లు ఆర్థిక మంత్రి భట్టి వెల్లడించారు. అంతేకాక 17 అండర్ పాస్ లు కూడా ఏర్పాటు చేయబోతున్నట్లు వివరించారు. వీటితోపాటు నగరంలోని 10 రహదారులను విస్తరించి ట్రాఫిక్ క్రమబద్దీకరణ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రూ.7 వేల 032 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించబోతున్నామని ఈ మేరకు అసెంబ్లీ సభా వేదికగా బడ్జెట్ స్పీచ్ లో వివరించారు. వీటికి తోడు మరో 150 కోట్ల రూపాయలతో హైదరాబాద్ సిటీ సుందరీకరణ పనులు కూడా ప్రారంభించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ సిటీ భవిష్యత్ అవసరాలు, రాబోయే రోజుల్లో పెరగనున్న బైక్స్, కార్లు, ఇతర వాహనాల రద్దీకి అనుగుణంగా రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Hyderabad Traffic Woes State Government Plans 31 Flyovers and 17 Underpasses

ఇక డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2025-26 వార్షిక బడ్జెట్ ను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. 3,04,965 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదనలను సమర్పించారు. కాగా, ఈ బడ్జెట్ లో భట్టి రెవెన్యూ వ్యయం - రూ.2,26,982 కోట్లుగా పేర్కొన్నారు. మూలధన వ్యయం- రూ.36,504 కోట్లు గా పేర్కొన్నారు. బడ్జెట్ లో కీలక అంశాలను ప్రస్తావించారు. ప్రస్తుత ధరల ప్రకారం జీఎస్‌ పీ రూ.16,12,579 కోట్లుగా పేర్కొన్నారు. గతేడాదితో పోలిస్తే వృద్ధిరేటు 10.1 శాతం నమోదు అయినట్లు వెల్లడించారు. ఇక.. ఈ బడ్జెట్ లో మహిళలు - రైతుల కోసం కీలక ప్రతిపాదనలు.. కేటాయింపులు చేసారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+