ఆస్ట్రేలియాలో హైదరాబాద్ మహిళది హత్యే, భర్తే హంతకుడు

మెల్బోర్న్/హైదరాబాద్: ఆస్ట్రేలియాలో హైదరాబాద్ నగరానికి చెందిన మహిళ శ్వేత దారుణ హత్యకు గురైంది. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ.. ఆమెది హత్యేనని కొంచెం ఆలస్యంగా తేలింది. అయితే, ఆమెను హత్య చేసింది భర్త అశోక్ రాజ్ కావడం గమనార్హం. ఈ దారుణ ఘటన ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని బక్లీలో చోటు చేసుకుంది.

భార్యను హత్య చేసిన తర్వాత ఆమె మృతదేహాన్ని ఓ చెత్తకుండీలో పడేశాడు అశోక్. కాగా, రోడ్డు పక్కన ఉన్న ఆ చెత్తకుండీలో శ్వేత మృతదేహాన్ని అక్కడి పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గుర్తించిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేపట్టి, అశోక్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు.

hyderabad woman murdered in Australia her husband arrested for the crime

హత్య అనంతరం కుమారుడిని హైదరాబాద్‌ తీసుకొచ్చి శ్వేత అమ్మవాళ్ల ఇంట్లో వదిలేశాడు నిందితుడు అశోక్. ఆ తర్వాత తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయాడు. మృతదేహాన్ని గుర్తించిన విక్టోరియా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడైన అశోక్‌రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కాగా, ఆస్ట్రేలియాలో మృతి చెందిన శ్వేత మృతదేహాన్ని త్వరగా హైదరాబాద్ నగరానికి తీసుకు వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి తెలిపారు. ఇందుకోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోనూ మాట్లాడినట్లు స్పష్టం చేశారు. అక్కడ శ్వేత మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి చేసినట్లు సమాచారం ఉందన్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత ఆమె భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడానికి ప్రయత్నిస్తామని ఆయన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+