హైదరాబాదీ దమ్ బిర్యానీ కుమ్మేశారుగా..ఆన్‌లైన్‌లోనే లక్షల ఆర్డర్లు; స్విగ్గీ లెక్కలు!!

తింటే గారెలు తినాలి.. ఇది ఒకప్పటి మాట. కానీ తింటే హైదరాబాదీ దమ్ బిర్యానీనే తినాలి.. ఇది హైదరాబాద్ వాసులు అందరూ చెబుతున్న మాట. హైదరాబాద్ బిర్యానికి దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. హైదరాబాద్ కు వస్తే బిర్యాని రుచి చూడకుండా ఎవరూ వెళ్లరు అంటే అతిశయోక్తి కాదు. అంతగా హైదరాబాద్ బిర్యానీ ఫేమస్ అయింది.

మన దేశంలోని ఫేమస్ అయిన ఫుడ్ లలో హైదరాబాదీ దమ్ బిర్యాని ఒకటి అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అటువంటి హైదరాబాద్ దమ్ బిర్యాని పైన హైదరాబాద్ వాసుల ప్రేమ మాత్రం అమోఘం. ఈ విషయాన్ని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గి లెక్కలతో సహా చెప్పింది.

Hyderabadi Dum Biryani

ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో హైదరాబాద్ వాసులు ఆన్లైన్లో 72 లక్షల బిర్యాని ఆర్డర్లు చేశారని, ప్రపంచ బిర్యాని డే సందర్భంగా ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఈ విషయాన్ని వెల్లడించింది. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రతి ఐదు ఆర్డర్లలోనూ ఒకటి హైదరాబాదీ బిర్యానీ ఉంటుందని స్విగ్గీ పేర్కొంది. హైదరాబాద్ లో జనవరి 23 నుంచి జూన్ 15 మధ్య ఆర్డర్ల లెక్కను వెల్లడించింది.

ఈ సంవత్సరం మొదటి ఐదు నెలల కాలంలో హైదరాబాద్ లో బిర్యానీ ఆర్డర్ లు 8.39 శాతం పెరిగాయని స్విగ్గి పేర్కొంది. ఏడాది కాలంలో బిర్యానీ ఆర్డర్ లు 150 లక్షలకు పైగా వచ్చినట్టుగా స్విగ్గి ప్రకటించింది. పైగా తొమ్మిది లక్షలకు పైగా ఆర్డర్ లతో దమ్ బిర్యాని రికార్డు సృష్టిస్తే, బిర్యానీ రైస్ 7.9 లక్షలు, సింగిల్ బిర్యానీ 5.2 లక్షలతో తర్వాత స్థానాలలో ఉన్నాయని స్విగ్గి పేర్కొంది.

హైదరాబాద్ నగరంలో బిర్యానీని ఆఫర్ చేసే రెస్టారెంట్లు 15 వేలకు పైగా ఉన్నాయని వీటిలో అధికంగా అమీర్ పేట్, బంజారాహిల్స్, కొత్తపేట, దిల్ సుఖ్ నగర్ , మాదాపూర్, కూకట్పల్లి లోనే ఉన్నాయని, ఇక ఏరియాల పరంగా ఆర్డర్ చూసినట్లయితే కూకట్పల్లి నుంచి ఎక్కువగా ఆర్డర్లు వచ్చాయని స్విగ్గి వెల్లడించింది.

Hyderabadi Dum Biryani

ఇక ఆ తర్వాతి స్థానాల్లో మాదాపూర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, కొండాపూర్ నిలిచాయని స్విగ్గీ పేర్కొంది. రెస్టారెంట్ మెనూ లో ఎన్ని రకాల ఆహారపదార్థాలు ఉన్నప్పటికీ హైదరాబాద్ బిర్యానీ లేకుంటే భోజనం పూర్తి కాదు అన్నట్టుగా పరిస్థితి ఉంది అని చెప్పడానికి ఆన్లైన్లో చేసిన ఈ ఆర్డర్లే ఒక ఉదాహరణ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+