ప్రకాష్ రాజ్ రాజీనామా పట్ల స్పందించిన మంచు విష్ణు: త్వరలో కలుస్తానంటూ..!

హైదరాబాద్: అత్యంత ప్రతిష్ఠాత్మకంగా సాగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. మెగా కాంపౌండ్‌కు చెందిన నటుడు, నిర్మాత నాగబాబు.. అసోసియేషన్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తాము మద్దతు ఇచ్చిన ప్రకాష్ రాజ్ విజయం పట్ల చివరి వరకూ అత్యంత ధీమాగా కనిపించారాయన. ఫలితాలు మాత్రం దీనికి భిన్నంగా రావడంతో ఆవేదనకు గురయ్యారు. మాకు ప్రాతీయవాదాన్ని అపాదించారనే కారణంతో సభ్యత్వానికి రాజీనామా చేశారు.

ఆ మరుసటి రోజే ప్రకాష్ రాజ్ కూడా అదే నిర్ణయాన్ని తీసుకున్నారు. తన సభ్యత్వానికి ఆయన కూడా రాజీనామా చేశారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను వివరించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మరీ.. తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఇండస్ట్రీకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సూచించారు. ప్రాంతీయవాదం ఆధారంగా ఈ ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ తనకు మద్దతు ఇచ్చారే తప్ప ఆయన ఎవరికి ఓటు వేశారో తనకు తెలియదని చెప్పారు.

I am not happy with your decision, need your ideas: Manchu Vishnu on Prakash Raj resign

తెలుగువాడు మాత్రమే ఉండాలనే నిర్ణయాన్ని సభ్యులు ఆమోదించారని, దీన్ని తప్పుపట్టలేమని ప్రకాష్ రాజ్ అన్నారు. ఓ కళాకారుడిగా తనకంటూ ఆత్మగౌరవం ఉంటుందని, ఆత్మ ప్రబోధానుసారమే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేశానని అన్నారు. కాగా ప్రకాష్ రాజ్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మంచు విష్ణు స్పందించారు. తనను అభినందిస్తూ ప్రకాష్ రాజ్ చేసిన ఓ వాట్సప్ మెసేజీకి బదులు ఇచ్చారు. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.

ప్రకాష్ రాజ్ తీసుకున్న నిర్ణయంతో తాను సంతోషంగా లేనని మంచు విష్ణు అన్నారు. వయస్సులో తనకంటే ప్రకాష్ రాజ్ పెద్దవారని, ఇలాంటి వాటిని ఎన్నో చవి చూశారని పేర్కొన్నారు. గెలుపోటములు అనేవి ఒకే నాణేనికి రెండు పార్శ్యాల్లాంటివని, ఈ విషయం తనకంటే ప్రకాష్ రాజ్‌కే బాగా తెలుసునని వ్యాఖ్యానించారు. ఎలాంటి భావోద్వేగానికి గురి కావొద్దని మంచు విష్ణు విజ్ఞప్తి చేశారు. భావోద్వేగంతో నిర్ణయాలను తీసుకోకూడదని చెప్పారు.

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కుటుంబంలో ప్రకాష్ రాజ్ ఓ సభ్యుడని అన్నారు. అసోసియేషన్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడంలో ప్రకాష్ రాజ్ ఆలోచనలు, సలహాలు, సూచనలు అవసరమని చెప్పారు. పరిశ్రమను అభివృద్ధి చేయడానికి కలిసి పని చేద్దామని కోరారు. ఇప్పటికిప్పుడు తనకు ఎలాంటి బదులు ఇవ్వొద్దని, త్వరలోనే తాను వ్యక్తిగతంగా వచ్చి కలుస్తానని మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్‌కు చెప్పారు. చాలా విషయాలపై మాట్లాడుకోవాల్సి ఉందని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+