కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను సమర్థించను: ఎంపీ అరవింద్, ఈడీ విచారణ ఇలా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సమర్థించబోనని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. సామెతలను జాగ్రత్తగా వినియోగంచాలని సూచించారు. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీజేపీకి సంబంధం లేదని.. అవి ఆయన వ్యక్తిగతంగా చేసివుంటారన్నారు. అంతేగాక, బండి సంజయ్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే బాగుంటుందని హితవు పలికారు.
మరోవైపు, ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ అంశంపైనా ఆయన ఎంపీ అరవింద్ వ్యాఖ్యలు చేశారు. కీలకమైన విచారణ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ ఆందోళనలు చేయడం కంటే.. అధికారులు అడిగే ప్రశ్నలకు జవాబిస్తే బాగుంటుందన్నారు. మార్చి 11న జరిగిన ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణతో మొత్తం తెలంగాణ ప్రభుత్వం ఢిల్లీకి వచ్చిందని ఆరోపించారు. ఈ చిత్తశుద్ధి రాష్ట్ర అభివృద్ధి, తెలంగాణ మహిళల పట్ల ఉంటే బాగుండనిన అన్నారు.

కవిత ఈడీ విచారణతో మంత్రులు రాష్ట్ర పరిపాలన వదిలిపెట్టి ఢిల్లీకి వచ్చారన్నారు. అంతేగాక, ఈడీ విచారణలో కవిత సరైన సమాధానాలు చెప్పలేదని తెలిపారు. తప్పుడు సమాధానాలు ఇస్తే.. త్వరగా అరెస్టు ఖాయమని అరవింద్ అన్నారు. తెలంగాణ సొమ్ము దోచుకున్నారని.. ఇప్పుడు ఢిల్లీ ప్రజల సొమ్ము దోచుకున్నారని అరవింద్ ఆరోపించారు. కవితకు లక్షల రూపాయలు వాచ్‌లు, కోట్ల రూపాయల చెవి కమ్మలు ఎక్కడివని అరవింద్ ప్రశ్నించారు. కేసీఆర్, కేటీఆర్ అవినీతి అందరికీ తెలుసన్నారు. బీజేపీ అంటే అవినీతి రహిత పార్టీ అన్నారు.
అప్పుడు వాజపేయి కానీ.. ఇప్పుడు మోడీ ప్రభుత్వం కానీ అవినీతి అంటే సహించదని అరవింద్ స్పష్టం చేశారు. తప్పు చేయకుంటే ఎందుకు అంత రచ్చ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలను అరవింద్ నిలదీశారు. రాజకీయాల్లో అంటరాని వాళ్లు కల్వకుంట్ల కుటుంబమని మండిపడ్డారు. మీరు తప్పు చేయకుంటే 16న విచారణకు రావాలని.. తప్పు చేయకుంటే మీరు నిజాయితీగా బయటికి వస్తారని బీఆర్ఎస్ నేతలనుద్దేశించి అన్నారు. కేసీఆర్, కవితలు ఒత్తిడి చేయడం వల్లే అరుణ్ రామచంద్ర పిళ్లై.. ఈడీకి ఇచ్చిన వాంగ్మూలం వెనక్కి తీసుకునేందుకు కోర్టుకు వెళ్లాడని.. ఇది లిక్కర్ కేసులో మరింత కీలకం కానుందని అరవింద్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ సీఎం పదవికి రాజీనామా చేసి వెంటనే ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.












Click it and Unblock the Notifications