నాపై కక్షతీర్చుకొనేందుకే, ప్లాన్డ్ ఆత్మహత్య, పాప తట్టుకోలేదు: వనితారెడ్డి సంచలనం

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: తెలుగు సినీ నటుడు విజయ్ సాయితో ఎందుకు విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో దానికి సంబంధించిన ఆధారాలను పోలీసులకు సమర్పించనున్నట్టు విజయ్ సాయి సతీమణి వనితారెడ్డి చెప్పారు.

పోలీసులకు లొంగిపోయిన.. విజయ్‌సాయి భార్య !

ఆధారాలు సేకరిస్తున్నా, విజయ్‌ మరో రూపం తెలియాలి: వనితారెడ్డి షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ నటుడు విజయ్ సాయి డిసెంబర్ 6వ, తేదిన తన ఇంట్లోనే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆత్మహత్య చేసుకొనే ముందు సెల్పీ వీడియో రికార్డు చేశాడు విజయ్ సాయి.

బెడ్‌రూమ్‌కే అమ్మాయిలను తీసుకొచ్చేవాడు, నాపై తప్పుడు ప్రచారం: వనితారెడ్డి సంచలనం

అయితే విజయ్ సాయి తన ఆత్మహత్యకు తన భార్య వనితారెడ్డితో పాటు న్యాయవాది శ్రీనివాస్‌తో పాటు మరో వ్యక్తి పేరును కూడ విజయ్ సాయి ప్రస్తావించారు.అయితే విజయ్ సాయి ఆత్మహత్య కేసులో పోలీసుల విచారణకు వనితారెడ్డి బుదవారం నాడు హజరయ్యారు.

 విడాకుల నిర్ణయానికి కారణమైన ఆధారాలను పోలీసులకు ఇస్తా

విడాకుల నిర్ణయానికి కారణమైన ఆధారాలను పోలీసులకు ఇస్తా

మూడేళ్ళ క్రితం విజయ్ సాయితో విడిపోవాలని విడాకుల పిటిషన్ ఎందుకు వేయాల్సి వచ్చిందనేందుకు సంబంధించిన పూర్తి ఆధారాలను పోలీసులకు ఇవ్వనున్నట్టు వనితారెడ్డి చెప్పారు. తాను విజయ్ సాయితో విభేదించడానికి గల కారణాలను అందరికీ వివరించనున్నట్టు చెప్పారు. దీనికి సంబందించిన ఆధారాలన్నింటిని కూడ పోలీసులతో పాటు మీడియాకు కూడ ఇవ్వనున్నట్టు చెప్పారు.

 కక్ష తీర్చుకొనేందుకు విజయ్ నా పేరు చెప్పారు

కక్ష తీర్చుకొనేందుకు విజయ్ నా పేరు చెప్పారు

ఆత్మహత్య చేసుకొనే ముందు విజయ్ సాయి తన పేరు చెప్పడం కక్ష తీర్చుకొనేందుకేనని వనితారెడ్డి అభిప్రాయపడ్డారు. ఉద్దేశ్యపూర్వకంగానే నా పేరును విజయ్ సాయి సెల్పీ వీడియో లో చెప్పి ఉంటారని వనితారెడ్డి అభిప్రాయపడ్డారు.విజయ్ ఎందుకు చనిపోయాడో తనకు కూడ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.ప్లాన్డ్‌గా జరిగిన ఆత్మహత్యగా అనిపిస్తోందని వనితారెడ్డి అనుమానాన్ని వ్యక్తం చేశారు.

 పాప తట్టుకోలేదనే కారణంగానే

పాప తట్టుకోలేదనే కారణంగానే

విజయ్ సాయి అంత్యక్రియల సందర్భంగా ఆ దృశ్యాలను చూస్తే తన కూతురు తట్టుకోలేదనే కారణంగానే అంత్యక్రియలకు పాపను పంపలేదని చెప్పారు.ప్రతి వారం పాప కోసం విజయ్ తన వద్దకు వచ్చేవాడని చెప్పారు.అయితే ఆ సమయంలో కూడ తనను ఇబ్బందిపెట్టేవాడని వనితారెడ్డి ఆరోపించారు. కూతురుపై ప్రేమ ఉంటే విజయ్‌సాయి ఎందుకు ఆత్మహత్య చేసుకొన్నాడని ఆమె ప్రశ్నించారు.

 నాపై బురదచల్లుతున్నారు

నాపై బురదచల్లుతున్నారు

విజయ్ సాయి కుటుంబసభ్యులు తమ తప్పును కప్పి పుచ్చుకొనేందుకే నాపై బురద చల్లుతున్నారని వనితారెడ్డి ఆరోపించారు.తాను ఏనాడూ కూడ విజయ్‌సాయిపై పగ తీర్చుకోవాలని భావించలేదని వనితారెడ్డి చెప్పారు. మూడేళ్ళుగా తనకు విజయ్‌కు సంబంధాలు లేవని చెప్పారు.విజయ్‌కు సంబందించిన సాక్ష్యాలన్నీ కూడ ఉన్నాయన్నారు. వాటిని పోలీసులకు ఇవ్వనున్నట్టు చెప్పారు. పోలీసులు తనను విచారిస్తే అన్ని విషయాలను వివరిస్తానని చెప్పారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకలల జీవిత భాగస్వామిని కనుగొనండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
vanitha reddy said that I will submit to evidences to police. Vanitha Reddy appeared before jubilee hills police on wednesday afternoon.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి