ఆధారాలు సేకరిస్తున్నా, విజయ్‌ మరో రూపం తెలియాలి: వనితారెడ్డి షాకింగ్ కామెంట్స్

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: అన్ని రకాల ఆధారాలను సేకరించిన తర్వాతే పోలీసులకు లొంగిపోతానని సినీ నటుడు విజయ్ సతీమణి వనితారెడ్డి చెప్పారు. ఇప్పటికే చాలా ఆధారాలను సేకరించానని ఆమె చెప్పారు. ఆధారాలను సేకరించేందుకే తాను బయటకు వచ్చానని చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఆధారాలతో సహ పోలీసుల ముందు లొంగిపోనున్నట్టు వనితారెడ్డి చెప్పారు.

  ఇంట్లోనే ఇతర అమ్మాయిలతో..: విజయ్ అక్రమసంబంధాలపై ఫొటోలు సంచలనం | Oneindia Telugu

  తెలుగు సినీ నటుడు విజయ్ ఈ నెల 6వ,తేదిన ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విజయ్ ఆత్మహత్యకు ముందు సెల్పీ వీడియోలో భార్య వనితారెడ్డితో పాటు మరో ఇద్దరిపై ఆరోపణలు చేశారు.

  విజయ్ చనిపోయిన రెండు రోజుల తర్వాత వనితారెడ్డి పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్నారు. అయితే ఇప్పటికే విజయ్‌‌కు సంబంధించిన ఆధారాలను సేకరించేందుకు తాను పోలీసులకు చిక్కకుండా బయట ఉంటున్నట్టు వనితారెడ్డి చెప్పారు. ఓ తెలుగు టీవీ ఛానెల్‌కు వనితారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చారు. రెండు రోజుల వ్యవధిలో రెండు తెలుగు ఛానల్స్‌కు వనితారెడ్డి ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన వైఖరిని ప్రకటించారు.

  ఆధారాలు సేకరించేందుకు పోలీసులకు దూరంగా

  ఆధారాలు సేకరించేందుకు పోలీసులకు దూరంగా

  విజయ్ తనపై చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని వనితారెడ్డి చెబుతున్నారు. ఈ విషయమై నిరూపించేందుకు తాను ఆధారాలను సేకరిస్తున్నట్టు చెప్పారు.విజయ్ ఎలాంటి వాడో ఇప్పటికే తాను రెండు ఫోటోలను విడుదల చేసిన విషయాన్ని వనితారెడ్డి గుర్తు చేశారు. ఇతర ఆధారాలను కూడ సేకరిస్తున్నట్టు ఆమె చెప్పారు.ఆధారాల సేకరణ దాదాపుగా పూర్తి కావచ్చిందన్నారు. ఇంకా కీలకమైన రెండు మూడు ఆధారాలు తన వద్దకు రావాల్సి ఉందన్నారు. ఈ ఆధారాలు తన చేతికి అందిన తర్వాత పోలీసులకు లొంగిపోనున్నట్టు ఆమె చెప్పారు.

  బెడ్‌రూమ్‌కే అమ్మాయిలను తీసుకొచ్చేవాడు, నాపై తప్పుడు ప్రచారం: వనితారెడ్డి సంచలనం

  విజయ్‌ గురించి తెలియాలి

  విజయ్‌ గురించి తెలియాలి

  విజయ్ గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశ్యంతోనే తాను మీడియా ఛానెళ్ళకు ఇంటర్వ్యూలు ఇస్తున్నట్టు చెప్పారు. ఆత్మహత్య చేసుకొన్న విజయ్‌పై జాలి ఉంటుందన్నారు. కానీ, విజయ్ గురించి అసలు విషయాలు అందరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.అమ్మాయిలతో విజయ్ అసభ్యంగా ప్రవర్తించేవాడని ఆమె చెప్పారు. ఈ విషయాలు అతడి స్నేహితులకు కూడ తెలుసునని చెప్పారు.

  ట్విస్ట్: భార్యతో 2 రోజులు సంతోషంగా ఉందామన్న విజయ్, అదృశ్యమైన వనితారెడ్డి?

  విజయ్ అతిగా ప్రవర్తించేవాడు

  విజయ్ అతిగా ప్రవర్తించేవాడు

  విజయ్ కొన్ని సమయాల్లో అతిగా ప్రవర్తించేవాడని వనితారెడ్డి ఆరోపించారు. సైకో తరహలోనే ఆయన ప్రవర్తన ఉండేదని ఆమె చెప్పారు. కానీ, ఒక్క రోజు తనను వెంటాడి కారులో కూర్చొని దాడికి దిగాడని ఆమె చెప్పారు. ఈ విషయమై పోలీసులకు కూడ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. ఈ దాడి జరుగుతున్న సమయంలో విజయ్ తండ్రి సుబ్బారావుకు కూడ చెప్పానని ఆమె గుర్తు చేశారు. విజయ్ గురించి అన్నీ తెలిసిన సుబ్బారావు తొలుత తనకు మద్దతుగా మాట్లాడేవారని ఆమె గుర్తు చేశారు. కానీ కారణాలేమిటో తెలియదు కానీ, సుబ్బారావు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.

  విజయ్ చనిపోవడానికి కారణం తేలాలి

  విజయ్ చనిపోవడానికి కారణం తేలాలి

  విజయ్ ఆత్మహత్యకు కారణం ఎవరో తేలాల్సిన అవసరం ఉందన్నారు. విజయ్ ఆత్మహత్య చేసుకొనే ముందు తన పేరు,ను ప్రస్తావించారని చెప్పారు. కానీ, ఈ మూడేళ్ళుగా విజయ్‌తో తనకు సంబంధం లేదని చెప్పారు. కోర్టులో లేదా, పాప కోసం వారం వారం కలవడం తప్ప ఇతరత్రా ఎక్కడ కలిసిన సందర్భాలు లేవని వనితారెడ్డి చెప్పారు.

  తప్పు చేయలేదు

  తప్పు చేయలేదు

  నేను ఎలాంటి తప్పు చేయలేదని వనితారెడ్డి చెప్పారు. తనపై విజయ్‌ కుటుంబసభ్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. నా తల్లిపై కూడ అనవసర ఆరోపణలు చేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. విజయ్ కుటుంబసభ్యులు చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. విజయ్ తరచూ ఇదే రకంగా తనను దూషించేవాడని వనితారెడ్డి చెప్పారు. విజయ్ తప్పును కప్పిపుచ్చేందుకే తనపై బురద చల్లుతున్నారని ఆమె చెప్పారు.

  పాప గురించే ఆందోళన

  పాప గురించే ఆందోళన

  పాప గురించే తన ఆందోళన ఉందని వనితారెడ్డి చెప్పారు. తనను జైల్లో పెడతారా అని తన కూతురు ప్రశ్నిస్తోందని చెప్పారు. తన తప్పుంటే ఏ శిక్షకైనా తాను సిద్దమేనని ఆమె చెప్పారు. తన బిడ్డ భవిష్యత్ గురించే తన ఆందోళన ఉందని ఆమె చెప్పారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  I will be surrendered to police after gathering evidence said Vanitha Reddy.A Telugu news channel interviewed her on Thursday.within two days I will surrender to police she said.meta key words

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి