కీసరలో కుప్పకూలిన విమానం: మంటల్లో కాలిబూడిదైంది
మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని పెద్దమ్మ చెరువు వద్ద సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం కుప్ప కూలిపోయింది.
హైదరాబాద్: మేడ్చల్ జిల్లా కీసర సమీపంలోని పెద్దమ్మ చెరువు వద్ద సాంకేతిక లోపంతో ఓ శిక్షణ విమానం కుప్ప కూలిపోయింది. గురువారం ఉదయం హకీంపేట్ శిక్షణ కేంద్రం నుంచి విమానం బయల్దేరిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

ఘటన సమయంలో హెలికాప్టర్‌లో పైలట్‌తో పాటు మరో ఇద్దరు ఉన్నారు. వీరంతా పారాచ్యూట్‌ల సాయంతో సురక్షితంగా బయటపడ్డారు. పెద్దమ్మ చెరువు సమీపంలో గుట్టల మధ్య కూలిన విమానం కొన్ని క్షణాల్లోనే మంటల్లో కాలిపోయింది.
మంటలను ఆపేందుకు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే సరికి హెలికాప్టర్ పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ జరగకపోవడంతో అధికారులు ఊపిరితీసుకున్నారు.












Click it and Unblock the Notifications