ఐ-బొమ్మ రవి కేసులో సంచలనం.. తెరపైకి ఆ వ్యక్తి పేరు..!

ఐ-బొమ్మ నిర్వాహకుడు రవి కేసులో పోలీసులు విచారిస్తున్న కొద్దీ కొత్త కొత్త విషయాలు బయటపడుతున్నాయి. తాజాగా రవి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇమ్మడి రవి వద్ద మరొక వ్యక్తి పేరుతో నకిలీ గుర్తింపు కార్డులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ప్రహ్లాద్ వెల్లేల అనే వ్యక్తి పేరుతో రవి ఫేక్ పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. కానీ ప్రహ్లాద్ మాత్రం నాకు ఐ బొమ్మ రవితో ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడు. దీంతో ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

తెలుగు చిత్ర సీమలో ప్రకంపనలు సృష్టించిన ఐ బొమ్మ రవి.. చివరికి పోలీసులకు కూడా పట్టుకోండి చూద్దాం అంటూ సవాల్ విసిరి.. ఎట్టకేలకు పోలీసులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అతడి కేసు విచారణలో భాగంగా రోజుకో కొత్త విషయం బయటకు వస్తోంది. తాజాగా ఐ బొమ్మ రవి కేసులో మరొకరి పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. ప్రహ్లాద్ వెల్లేల పేరిట ఇమ్మడి రవి పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

విచారణ చేస్తుంటే.. అతడు తన ఫ్రెండ్ అని.. అప్పట్లో ఇద్దరం ఒకే రూమ్ లో ఉండేవాళ్లం అని అందుకే ఆ పేరును వాడుకున్నట్టుగా రవి పోలీసులకు వెల్లడించాడు. దాంతో ప్రహ్లాద్ గురించి ఆరా తీసిన పోలీసులు.. ప్రహ్లాద్ ప్రస్తుతం బెంగళూరులో సాఫ్ట్‌ వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నట్లు గుర్తించి అతడ్ని హైదరాబాద్‌ కు పిలిపించారు. కస్టడీలో ఉన్న రవిని ఎదురుగా ఉంచి ప్రహ్లాద్‌ ను ఉంచి విచారించారు పోలీసులు. దాంతో అసలు విషయం బయటపడింది.

'నాకు రవి ఎవరో తెలియదు. నా పేరు మీద పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడని తెలిసి నేను షాక్‌ అయ్యాను' అని ప్రహ్లాద్ పోలీసులకు వివరణ ఇచ్చాడు. దాంతో రవి చెప్పిన ఫ్రెండ్ కథ కల్పితం అని పోలీసులుకు అర్థం అయింది. అయితే ప్రహ్లాద్‌ కు సంబంధించిన డాక్యుమెంట్లను రవి దొంగిలించి.. వాటి ఆధారంగా ఫేక్ గుర్తింపు కార్డులను సృష్టించి ఉంటాడని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రేపటితో రవి పోలీసు కస్టడీ ముగియనుంది.

iBomma Piracy Case Twist Prahlad s Name Emerges in Immadi Ravi Investigation

ఇక విశాఖపట్నానికి చెదిన ఇమంది రవి ఐ బొమ్మ పైరసీలో ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. పోలీసుల కస్టడీలో విచారణలో భాగంగా హార్డ్ డ్రైవ్‌ లలో అనేక భాషల్లో దాదాపు 21,000 సినిమాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. ఐ బొమ్మ వెబ్ సైట్ ద్వారా రవి రూ.20 కోట్లు సంపాదించినట్లు తెలుస్తోంది. ఇక దర్యాప్తు సమయంలో అతని బ్యాంకు ఖాతాల్లోని సుమారు రూ. 3.5 కోట్లను సీజ్ చేశారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+