ప‌ర్మిట్ రూంలే ప్ర‌చార కేంద్రాలా..? గులాబీ పార్టీ కి అదే కిక్కు..!!

హైద‌రాబాద్: ఎన్నిక‌ల స‌మ‌యంలో రాజ‌కీయ పార్టీల వ్య‌వ‌హారం ఎంత విచిత్రంగా ఉంటుందో అంతే స్థాయిలో హాస్యాన్ని కూడా పండిస్తుంటాయి. ఓట‌ర్ల‌ను ఆక‌ర్షించ‌డానికి ఆయా పార్టీలు చేసే ఫీట్లు చూస్తుంటే స‌ర్క‌స్ ను త‌ల‌పిస్తుంటాయి. తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ఇలాంటి మ‌త్తైన, గ‌మ్మ‌త్తైన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుంటున్నాయి. అదికార‌పార్టీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్శించేందుకు ఎలాంటి ప్ర‌దేశంలో లో పాగా వేసిందో తెలిస్తే ఔరా అన‌కుండా ఉండ‌లేరు. తెలంగాణ‌లోని కొన్ని జిల్లాల్లో అదికార గులాబీ పార్టీ ఓట‌ర్ల‌ను ఆక‌ర్శించ‌డానికి ఎంత‌టి వినూత్న ప్ర‌య‌త్నం చేస్తోందో తెలుసుకుందాం..!!

తెలంగాణ రాజకీయం రసవత్తరం..! ఎవ‌రిని వ‌ద‌ల‌ని వైనం..!!

తెలంగాణ రాజకీయం రసవత్తరం..! ఎవ‌రిని వ‌ద‌ల‌ని వైనం..!!

ఎన్నికలు దగ్గరవుతున్న కొద్దీ తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎన్నికల కోసం రాష్ట్రంలోని పార్టీలన్నీ తెగ హడావిడి చేస్తున్నాయి. వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నాయి. పార్టీల హడావిడి ఏమోగానీ తెలంగాణలో మందుబాబులు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. దీంతో తెలంగాణలో శాసన సభ ఎన్నికల షెడ్యూల వచ్చాక వైన్ షాపుల పక్కన ఉండే పర్మిట్ రూములు ఏకంగా బార్లను తలపిస్తున్నాయి.

 ఓట‌ర్ల‌ను ఆకర్శించ‌డానికి వినూత్న ప్ర‌య‌త్నం..!గులాబీని గుర్తుంచుకుంటారా..?

ఓట‌ర్ల‌ను ఆకర్శించ‌డానికి వినూత్న ప్ర‌య‌త్నం..!గులాబీని గుర్తుంచుకుంటారా..?

గ్రామాల్లో ఎన్నికల సందడి మొదలయ్యాక మేజర్ పంచాయతీలు, చిన్న చిన్న పట్టణాలు, నగరాల్లోని పర్మిట్ రూములు భారీ బార్లుగా మారిపోయాయి. వాస్తవానికి పర్మిట్ రూములంటే 100 చదరపు మీటర్లు విస్తీర్ణంలో మాత్రమే ఈ పర్మిట్ రూమ్ ఉండాలి. కేవలం వైన్ షాపుల పక్కనే ఉండాలి. ఇప్పుడు ఆ రూంలే గులాబీ పార్టీకి వ‌రంలా ప‌రిణ‌మించాయి.

జ‌నాన్ని మ‌త్తులో ముంచుతున్న అదికార పార్టీ..! మ‌రి మ‌త్తు దిగాక మ‌త‌ల‌బేంటి..?

జ‌నాన్ని మ‌త్తులో ముంచుతున్న అదికార పార్టీ..! మ‌రి మ‌త్తు దిగాక మ‌త‌ల‌బేంటి..?

వైన్ షాప్ లో కొనుగోలు చేసిన లిక్కర్, బీర్లను ఇక్కడ తాగొచ్చు. కానీ లిక్కర్ షాపుల యజమానులు, ఎక్సయిజ్ శాఖ అధికారులు కుమ్మక్కయి పర్మిట్ రూమ్ ను బార్లుగా మార్చేశారు. మద్యం అమ్మకాల ద్వారా ఆదాయం వస్తుండడంతో ప్రభుత్వం వీటిని పరోక్షంగా ప్రోత్సహిస్తోందనే విమర్శలు ఉన్నాయి. కనీసం ఎన్నికల సంఘమైనా ఈ పర్మిట్ రూముల వ్యవహారాన్ని నియంత్రించి నిబంధనలు అమలయ్యేలా చూస్తుందా అంటే ఇప్పటి వరకు అలాంటి చర్యలేవీ తీసుకోలేదు.

 కాదేదీ ప్ర‌చారానికి అన‌ర్హం..! ప‌ర్మిట్ రూంలే ప‌ర‌మ ప‌విత్ర ప్ర‌దేశాలు..!!

కాదేదీ ప్ర‌చారానికి అన‌ర్హం..! ప‌ర్మిట్ రూంలే ప‌ర‌మ ప‌విత్ర ప్ర‌దేశాలు..!!

యథేచ్ఛగా బెల్ట్ షాపులు, యథేచ్ఛగా పర్మిట్ రూములు కొనసాగుతున్నాయి. ఈ పర్మిట్ రూములు రాజకీయ పార్టీల మద్యం పంపిణీ కేంద్రాలుగా మారినట్టు చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కరీంనగర్, వరంగల్లు, నిజామాబాద్ జిల్లాల్లో నేతలు తమ అనుచరుల సాయంతో పర్మిట్ రూముల వద్ద కుల సంఘాలకు మద్యం పంపిణీ చేస్తూ అక్కడే జ‌నాన్ని మైకంలో ముంచెత్తుతున్న తెలుస్తోంది. ముఖ్యంగా అదికార గులాబీ పార్టీలోని కొంత మంది కుల సంఘాల నాయ‌కులు తిష్ట‌వేసి త‌మ సామాజిక వ‌ర్గం వారికి ఉచితమందు స‌ర‌ఫ‌రా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టిన‌ట్టు తెలుస్తోంది. అడ‌క్కుండానే ఉచితంగా పీక‌ల‌దాకా మందు తాగిస్తున్న వైనాన్ని చూసి మ‌త్తు దిగాగ తెగ న‌వ్వుకుంటున్నార‌ట గ్రామాస్తులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+