కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రం రావణ కాష్టం: భారీ కుట్ర!
తెలంగాణ రాష్ట్రంలో ఫార్ములా ఈ రేస్ కేసు దుమారం రేపుతోంది. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ ను ఏ వన్ నిందితుడిగా ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. ఇక ఇదే సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా రంగంలోకి దిగింది.
కేటీఆర్ పై ఫార్ములా ఈ రేస్ కేసు
ఇప్పటికే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కాపీ, సంబంధిత డాక్యుమెంట్లు ఇవ్వాలని ఈడీ అధికారులు ఏసీబీ డీజీకి లేఖ రాశారు. ఇక ఈ కేసులో ఏ క్షణానైనా కేటీఆర్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక కోర్టులో కేటీఆర్ ఈ కేసు నుండి ఉపశమనం కోసం ప్రయత్నిస్తున్నారు.

కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో జరిగేది ఇదే
అయితే ఇదే సమయంలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ అరెస్టు చేస్తే రాష్ట్రంలో అల్లర్లకు బీఆర్ఎస్ పార్టీ పకాగా ప్లాన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని రావణ కాష్టం చెయ్యాలని ప్లాన్ జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా లంచ్ బ్రేక్ లో మీడియాతో మాట్లాడిన ఆయన ఒకవేళ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అరెస్టు చేస్తే ఏం జరుగుతుందో చెప్పారు.
అల్లర్ల కోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు
రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చేయడానికి బిఆర్ఎస్ పార్టీ కుట్ర చేసిందని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు చొప్పున డబ్బు ఇప్పటికే ముట్టజెప్పింది అని కూడా సంచలన ఆరోపణలు చేశారు. అల్లర్లలో భాగంగా ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ ఆస్తులను తగలబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ కుట్రలను ఎక్కడికి అక్కడ తిప్పి కొట్టాలని ఆయన పోలీసులకు సూచించారు.
పోలీసులు అలెర్ట్ గా ఉండాలన్న ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
కేటీఆర్ ఆత్మ, బినామీ అయిన తేలుకుంట్ల శ్రీధర్ ఈ మేరకు కుట్రలు చేస్తున్నారని, ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయల డబ్బులు పంపిస్తున్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించిన ఆది శ్రీనివాస్ వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారాయి.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications