మొగున్ని తొక్కి, పెళ్లాన్ని కొరికితే పిల్లలు పుడతారా ..? యాదాద్రి జిల్లాలో ఆడిరూటే సపరేటు .?
హైదరాబాద్ : మొగుడిని కాళ్లతో తొక్కి, పెళ్లం ఒళ్లంతా తుడిమి .. ఎక్కడపడితే అక్కడ కొరికితే పిల్లలు పుడతారా ? సాధారణంగా అయితే ఈ కాలంలో అలా జరగదు, చాలామట్టుకు ఎవరూ విశ్వసించరు. కానీ యాదాద్రి జిల్లాలో ఓ మోసగాడు తన తెలివితో అమాయకులను మోసం చేస్తూ కొరుకుడు బాబాగా చలామణి అవుతున్నాడు.
కొరుకుడు బాబా ..
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం పుల్లాయగూడెం గ్రామంలో కొరుకుడు బాబా లీలలు వెలుగుచూశాయి. పక్క పోటోలో చేతులు కట్టుకొని ఉన్న బాబానే కొరుకుడు బాబా. వీడి పేరు కొప్పుల రాంరెడ్డి. వీనికి పెళ్లైంది. కూతురు కూడా ఉంది. సులభంగా డబ్బులు సంపాదించడం ఎలా అని ఆలోచించి చివరికీ కొరుకుడు బాబాగా ప్రత్యక్షమయ్యాడు.

చదివింది ఆరోతరగతి .. తెలివితేటలు మాత్రం మెండు
ఇతగాడు చదివింది ఆరోతరగతే. కానీ చావుతెలివితేటలు మాత్రం మెండుగా ఉన్నాయి. నల్లగొండ జిల్లా చెర్వుగట్టుకు వెళ్లి అక్కడే ఏడాది ఉన్నాడు. అక్కడ జాతకాలు, యంత్రాలు కట్టేవారితో పరిచయం చేసుకొని, కిటుకులు నేర్చుకున్నాడు. ఈ క్రమంలో తనను దేవుడు ఆవహించాడని ఇంటి వద్ద ఊగడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే తన అల్లుడిని దేవుడు ఆవహించాడని, ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపిస్తాడని అతని అత్త, మామలు చెప్పడంతో ఆ నోట ఈ నోట పాకి .. చుట్టుపక్కల గ్రామాలకు తెలిసి .. ఇతగాడిని దర్శించుకునేందుకు పోటెత్తారు.
ఆదివారం సేవలు .. కొరికితే రూ.200
ప్రతి ఆదివారం పుల్లాయగూడెం వచ్చి రాంరెడ్డితో చూయించుకునేవారు. కొరికితే రోగాలు నయమవుతాయని చెప్పి కొరకడం మొదలెట్టాడు.
రూ.100, రూ.200 ఫీజు వసూల్ చేశాడు. ఇక వ్యక్తుల వారి స్థాయిని బట్టి ముక్కుపిండి వసూల్ చేస్తుంటాడు.

పీక్‌కు చేరిన కొరుకుడు బాబా చేష్టలు
పిచ్చ్ పీక్ స్టేజీకి చేరినట్టు వీడి కొరుకుడు కూడా శృతిమించింది. ఆడామగా తేడాలేకుండా పడి కొరకడం ప్రారంభించాడు. ఒళ్లంతా తడమడం, మగవారిని పడుకోబెట్టి తొక్కే వికృత చేష్టలకు పాల్పడ్డాడు. కొరుకుడు బాబు పిచ్చి చేష్టలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

పట్టించిన సోషల్ మీడియా ..
కొరుకుడు బాబు .. పైత్య చేష్టలు సోషల్ మీడియా యూట్యూబ్ లో అప్ లోడయ్యై ... ట్రోల్ అవుతోంది. ఈ క్రమంలో వీడియో చూసిన పోలీసులు కొరుకుడు బాబాను అదుపులోకి తీసుకున్నారు. స్థానిక తహశీల్దార్ జ్యోతి ఎదుట బైండోవర్ చేశారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications