ఇన్‌కమ్ ట్యాక్స్ ఝలక్: ఐటిలో ఇంటి అద్దె తప్పుగా చూపిస్తే...
ఉద్యోగులు సమర్పిస్తున్న ఇంటి అద్దె రసీదులు సరైనవా? కావా? అనే అంశంపై ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్) విభాగం దృష్టి పెట్టనుంది.
హైదరాబాద్: ఉద్యోగులు సమర్పిస్తున్న ఇంటి అద్దె రసీదులు సరైనవా? కావా? అనే అంశంపై ఆదాయపు పన్ను (ఇన్‌కం ట్యాక్స్) విభాగం దృష్టి పెట్టనుంది. ఆదాయపు పన్ను మినహాయింపు పొందడం కోసం కొంతమంది తప్పుడు సమాచారంతో రసీదులు సమర్పిస్తున్నట్టుగా గుర్తించింది.
కొందరు సొంత ఇళ్లలో ఉంటూ తల్లిదండ్రులకు, బంధువులకు అద్దె ఇస్తున్నట్టు పత్రాలు సృష్టిస్తున్నారు. మరికొంతమంది తక్కువ అద్దె చెల్లిస్తూ ఎక్కువ ఇస్తున్నట్టు రసీదులు జత చేస్తున్నారు.

ఈ కారణంగా ఇంటి అద్దె భత్యంలో 60 శాతం మేర పన్ను మినహాయింపు పొందుతున్నారు. అధికారులకు అనుమానం వస్తే పన్ను చెల్లింపుదారు నుంచి ఆధారాలు కోరవచ్చని ఆదాయపు పన్ను ట్రైబ్యునల్ ఇది వరకే స్పష్టం చేసింది. అద్దె ఒప్పంద పత్రం, విద్యుత్తు బిల్లు, కొళాయి బిల్లు, హౌసింగ్ సొసైటీకి రాసిన లేఖ తదితరాలను ఆధారాలుగా చూపించాలని అడగనుంది.












Click it and Unblock the Notifications