21 ఏళ్లుగా ఊపిరితిత్తుల్లో ఇరుక్కుపోయిన పెన్ క్యాప్.. వైద్యుల మైండ్ బ్లాంక్..
చిన్న పిల్లలు ఆడుకుంటూ ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం అలవాటు. అందుకే పెద్దలు ఎప్పుడూ వారి వెంట ఉండి గమనిస్తూ ఉంటారు. అయితే ఓ యువకుడు 5 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు ఆటలాడుతూ పొరపాటున పెన్ క్యాప్ మింగేశాడు. అయితే ఇటీవల ఆ యువకుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది, విపరీతమైన దగ్గు లాంటివి వచ్చాయి. దీంతో ఆ యువకుడు ఆస్పత్రికి వెళ్లాడు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్ల మైండ్ బ్లాంక్ అయింది. అతని ఊపిరితిత్తుల్లో ఓ పెన్ క్యాప్ ఉన్నట్లు గుర్తించారు.

21 ఏళ్ల క్రితమే మింగేశాడు..
కరీంనగర్ ప్రాంతానికి చెందిన ఆ 26 ఏళ్ల యువకుడు తనకు ఐదేళ్ల వయసు ఉన్నప్పుడు ఆడుకుంటూ పెన్ క్యాప్ మింగేశాడు. ఇటీవల తీవ్ర అనారోగ్యం కారణంగా కొండాపుర్ లోని కిమ్స్ ఆస్పత్రికి వైద్యపరీక్షల కోసం వెళ్లాడు. కానీ వైద్యులు సీటీ స్కాన్ తీసి ఆయన ఊపిరితిత్తుల్లో ఏదో గడ్డ లాంటిది ఉందని.. అందువల్లనే ఊపిరితీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడని గ్రహించారు.
ఇదే విషయాన్ని కొండాపూర్ కిమ్స్ ఆస్పత్రి కన్సల్టెంట్ క్లినికల్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ శుభకర్ నాదెళ్ల ధ్రువీకరించారు. మొదట తన వద్దకు పేషంట్ వచ్చినప్పుడు ఇలా 21 ఏళ్ల క్రితం క్యాప్ మింగానని చెప్పాడు. అయితే మలంలో పోయి ఉంటుందిలే అని అనుకున్నానని తనకు చెప్పాడని డాక్టర్ శుభకర్ వివరించారు. ఇక సర్జరీ తప్పదని భావించిన డాక్టర్ శుభకర్.. దాదాపు 3 గంటలపాటు శ్రమించి సర్జరీని విజయవంతం చేశారు. ఆ పెన్ క్యాప్ ను ఊపిరితిత్తుల నుంచి తీసేశారు.
ఈ మేరకు చిన్నపిల్లలు ఆటలు ఆడేటప్పడు కనిపెడుతూ ఉండాలని డాక్టర్ శుభకర్ తెలిపారు. ఏదైనా సమస్య ఏర్పడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు.












Click it and Unblock the Notifications