హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శివలింగంపై అనుచిత వ్యాఖ్యలు.. వారిపై చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి కంప్లైంట్

|
Google Oneindia TeluguNews

హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ సయ్యద్ షరీఫుద్దీన్ అనే వ్యక్తిపై తెలుగు సినీ నటి 'కరాటే' కళ్యాణి శుక్రవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఇలాంటి వ్యాఖ్యల వల్ల సమాజం, ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని, శివలింగంపై అతను చేసిన అనుచిత వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య శత్రుత్వాన్ని పెంచే అవకాశం ఉందని కరాటే కళ్యాణి ఆరోపించారు.

చరిత్రలోనే తొలిసారిగా.. తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఒక్క నెలలో ఎంతో తెలుసా!!చరిత్రలోనే తొలిసారిగా.. తిరుమల శ్రీవారి హుండీకి భారీగా ఆదాయం.. ఒక్క నెలలో ఎంతో తెలుసా!!

లక్షలాది మంది హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని, అయితే నుపుర్ శర్మ కేసులో అనేక కేసులు నమోదవుతున్నాయని నటి కరాటే కళ్యాణి ఆరోపించారు. మహమ్మద్ ప్రవక్త మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన నుపుర్ శర్మ మీద కేసులు నమోదు చేసినట్టే శివలింగంపై దారుణమైన వ్యాఖ్యలు చేసే వారిపై కూడా కేసులు నమోదు చెయ్యాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేశారు.

 indecent comments on Shivalingam; Karate Kalyani compliant to take action against them

హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జూన్ 10 వ తేదీన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరాటే కళ్యాణితో పాటు ఫిర్యాదు చేయడానికి సనాతన హిందూ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. గత కొంతకాలంగా హిందూ ఆరాధ్యదైవం శివలింగంపై సయ్యద్ షరీఫుద్దీన్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నాడని కరాటే కళ్యాణి ఫిర్యాదు చేశారు. వెంటనే సదరు వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను వారు డిమాండ్ చేశారు.

హిందువులు, ముస్లింల మధ్య విద్వేషాలు సృష్టించేందుకు ఇలాంటి శక్తులు కొన్ని పనిచేస్తున్నాయి. ఇలాంటి వారిపై హిందువులంతా ఏకమై న్యాయం కోసం పోరాడాలని కరాటే కళ్యాణి వెల్లడించారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలి అని కరాటే కళ్యాణి పేర్కొన్నారు. 100 కోట్ల మంది పూజించే హిందువుల దైవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తే పోలీసులు చర్యలు తీసుకోవడం లేదని కరాటే కళ్యాణి ఆరోపించారు. నుపుర్ శర్మ వ్యవహారంలో కేసు నమోదు చేస్తున్న పోలీసులు, ఈ తరహా ఘటనలపై సైతం కఠిన చర్యలు తీసుకోవాలని కరాటే కళ్యాణి డిమాండ్ చేస్తున్నారు.

English summary
Karate Kalyani has filed a complaint seeking action against those who made indecent remarks on social media about the Shivalingam worshiped by Hindus.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X