శంషాబాద్ నుంచి మదీనాకు కొత్త ఇండిగో విమాన సేవలు షురూ..
హైదరాబాద్ నుంచి మదీనాకు వెళ్లాలనుకునే వారికి గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయం నుంచి మదీనాకు ఇండిగో కొత్త విమాన సేవలు ప్రారంభం అయ్యాయి. తొలి విమానం పర్యటకుల ఆనందోత్సాహం, కేరింతల మధ్య జీఎంఆర్ హైదరాబాద్ సీనియర్ అధికారుల సమక్షంలో బయలు దేరింది. ఈ సేవ ప్రతివారం మూడు రోజులు సోమవారం, గురువారం, శనివారం అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్ నుంచి సౌదీ అరేబియాలోని మదీనా ప్రయాణ సమయం 5 గంటల 47 నిమిషాలు. ఈ కొత్త సేవతో అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగవుతుందని అధికారులు భావిస్తున్నారు.
విమాన వివరాలు:
హైదరాబాదు నుండి మదీనాకు - Flight No. 6E57.. సోమవారం / గురువారం / శనివారంలో హైదరాబాద్ నుంచి రాత్రి 19:35 గంటలకు బయల్దేరుతుంది. అలాగే.. మదీనా నుండి హైదరాబాద్ కు Flight No. 6E57..సోమవారం / గురువారం / శనివారం 00:45 AST సమయంలో విమానం బయల్దేరుతుంది.

ఈ సందర్భంగా జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం లిమిటెడ్ (GHIAL) సీఈఓ ప్రదీప్ పనికర్ మాట్లాడుతూ. "మదీనాకు ఇండిగో తొలి విమాన సౌకర్యాన్ని కల్పించడం మా కోసం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కొత్త మార్గం మా అంతర్జాతీయ నెట్‌వర్క్‌ను విస్తరించడమే కాకుండా, హైదరాబాదును ప్రపంచంలోని అత్యంత ప్రముఖమైన ఆధ్యాత్మిక నగరాలలో ఒకటైన మదీనాతో అనుసంధానించే ప్రత్యేక ప్రయాణ అనుభవాన్ని ప్రయాణీకులకు అందిస్తుంది. అంతర్జాతీయ కనెక్టివిటీని మెరుగుపరచడం, ఎయిర్‌లైన్స్ కార్యకలాపాల విస్తరణకు మద్దతు ఇవ్వడం, మా విలువైన ప్రయాణికులకు సులభమైన ప్రయాణ ఎంపికలను అందించడం కొనసాగుతుంది." అని అన్నారు.












Click it and Unblock the Notifications